E-Paper
Advertisement

ప్లీజ్ దీపావళికి క్రాకర్స్ పేల్చండి.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన బాలు!

ప్లీజ్ దీపావళికి క్రాకర్స్ పేల్చండి.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన బాలు!
Advertisement

Gundeninda Gudigantalu Balu:  విష్ణుకాంత్ అంటే టక్కున ఎవరికి ఈయన గుర్తురారు కానీ గుండె నిండా గుడి గంటలు బాలు అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తాడు. గుండె నిండా గుడి గంటలు (Gundeninda Gudigantalu)సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు కాంత్ ఈ సీరియల్లో బాలు (Balu)పాత్రలో నటిస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా సీరియల్లో నటిస్తూ ఎంతోమందిని మెప్పిస్తున్న బాలు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే దీవాలి పండుగ (Diwali Festival)రాబోతున్న నేపథ్యంలో ఈయన అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు.

టపాసుల కోసం డబ్బు వేస్ట్..

దీపావళి పండుగ సందర్భంగా విష్ణు కాంత్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరూ కూడా టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే టపాసులు పేలుస్తూ పండగ జరుపుకునే వాళ్ళం కానీ పెద్దయిన తర్వాత టపాసులు కొని డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని టపాసులు కొనే వాడిని కాదు అయితే ఇప్పుడు మళ్లీ టపాసులు కొంటున్నానని విష్ణుకాంత్ తెలిపారు.

వేల కుటుంబాలకు భరోసా..

Advertisement

ఇక మీరు కూడా దీపావళికి టపాసులు కొని డబ్బులు వృధా చేయడం ఎందుకు అని ఆలోచించొద్దు. ప్రతి ఒక్కరు కూడా టపాసులు కొని దీపావళి పండుగను జరుపుకోండి. ఇలా మనం ఈ ఒక్క రోజు టపాసులు కొనటం వల్ల  టపాసులు అమ్ముతూ జీవనం సాగించే వారికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇలా క్రాకర్స్ కొనటం వల్ల కొన్ని వేల కుటుంబాలకు మంచి చేసిన వాళ్లమవుతామని అందుకే ప్రతి ఒక్కరూ క్రాకర్స్ కొని పండుగ జరుపుకోవాలని సూచించారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకొని కాల్చండి అంటూ ఈయన అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

?obrf=dzVvNXNybGY3aXc0

Advertisement

ఈ విధంగా బాలు దీపావళికి టపాసులు పేల్చమని కోరడంతో అభిమానులు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. మేము కూడా టపాసులు కొనే వాళ్ళం కాదు అంటూ కొంతమంది కామెంట్ చేయగా మరికొందరు అన్న డబ్బులు పంపించు టపాసులు కొంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. విష్ణు కాంత్ తమిళ నటుడు అయినప్పటికీ ఈయన గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమయ్యారు. మొదటి సీరియల్ తోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Also Read: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

Related News

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Big Stories

Advertisement
×