E-Paper
Advertisement

దీపావళి ధమాకా… ఒకే ఓటీటీలో మూడు భాషల సినిమాలు… ఇవి మాత్రం డోంట్ మిస్

దీపావళి ధమాకా… ఒకే ఓటీటీలో మూడు భాషల సినిమాలు… ఇవి మాత్రం డోంట్ మిస్
Advertisement

Diwali OTT Releases: దీపావళి పండుగ వచ్చిందంటే కొత్త సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఇంట్లోనే సందడి చేయాలనుకునేవారు చాలామంది ఉంటారు. అలాంటి ప్రేక్షకుల కోసం ఈసారి Sun NXT ఒకే రోజున మూడు భాషలకు చెందిన మూడు విభిన్న జానర్ల సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమిళంలో ఒక స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామా, మలయాళంలో మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్, తెలుగులో క్రైమ్ కామెడీ.. ఇలా ఒకే ఓటీటీలో మూడు రకాల వినోదం సిద్ధంగా ఉంది. ఈ మూడు చిత్రాలూ 2026 నవంబర్ 6 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

‘ది గ్రాండ్ మాస్టర్’ (The Grand Master)

ఈ సినిమా పూర్తిగా చదరంగం (Chess) ఆటను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కించబడింది. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు ఉన్నప్పటికీ, ఒక సాధారణ కుటుంబానికి చెందిన బాలుడు తన కలను ఎలా నిజం చేసుకోవాలనుకుంటాడు? ఆ ప్రయాణంలో అతడి తల్లి ఎలాంటి పోరాటం చేస్తుంది? అనే భావోద్వేగ అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. చెస్ ఆటలోని ఎత్తుగడలతో పాటు, సమాజంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ ఆ బాలుడు ప్రదర్శించే పట్టుదల ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాలో అబర్ణతి, లింగేశ్, సురేష్ చంద్ర మీనన్, మాస్టర్ అశ్విన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, వెట్రి సెలియన్ దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

‘ఐసీయూ’ (ICU)

Advertisement

పేరుకు తగ్గట్టుగానే ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఒక రోజు అనుకోకుండా జరిగిన దారుణమైన దాడి, మరోవైపు కుటుంబంలో తలెత్తిన అత్యవసర పరిస్థితి.. ఈ రెండూ ఒకే రోజున కొందరి జీవితాలను ఎలా తలకిందులు చేస్తాయనేదే ఈ చిత్రంలోని అసలు పాయింట్. ఆసుపత్రి లాంటి పరిమిత ప్రదేశంలో భయం, కోపం, అనుమానాలు, లోపల దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడే కొద్దీ సినిమా చాలా ఉత్కంఠగా సాగుతుంది. ఈ సినిమాలో బిబిన్ జార్జ్, బాబురాజ్, మురళీ గోపీ, విస్మయ, మీరా వాసుదేవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జార్జ్ వర్గీస్ దర్శకత్వం వహించిన ఈ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ సినిమాలను ఇష్టపడేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.

‘బా బా బ్లాక్ షీప్’ (Baa Baa Black Sheep)

మూడోది మన తెలుగు ప్రేక్షకుల కోసం వచ్చిన ‘బా బా బ్లాక్ షీప్’ (Baa Baa Black Sheep). పెళ్లి కోసం మేఘాలయకు వెళ్లిన సత్తిపండు, అతడి స్నేహితుడు సందీప్ అనుకోకుండా ఒక మిస్టరీ బాక్స్ వ్యవహారంలో చిక్కుకుంటారు. ఆ బాక్స్ కోసం వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ జాన్ వారి వెంట పడటంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారతాయి. స్నేహితుడిని కాపాడుకోవడం, ఆ మిస్టరీ బాక్స్ వెనుక ఉన్న అసలు విషయం తెలుసుకోవడం కోసం సందీప్ చేసే ప్రయత్నాలు కథలో కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్‌ను కలిపి చాలా సరదాగా ముందుకు తీసుకెళ్తాయి. ఈ చిత్రంలో విష్ణు ఓయ్, అక్షయ్ లగుసాని, సమృద్ధి ఆర్యాల్, మాల్వి మల్హోత్రా, ఉపేంద్ర లిమాయే, తిన్ను ఆనంద్, కార్తికేయ దేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గుణి మంచికంటి దర్శకత్వం వహించారు. కాసేపు నవ్వుకుంటూ, కొంచెం సస్పెన్స్‌ను ఆస్వాదించాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఈ మూడు సినిమాలు 2026 నవంబర్ 6 నుంచి Sun NXT వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Advertisement

Read Also: గోవా డ్రీమ్ జాబ్… ఊహించని లవ్‌స్టోరీలో అపార్థం తెచ్చిన పెను తుఫాన్… ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

Tags

Related News

‘దూకుడు’ స్టోరీతో… ఇండియన్ సినిమాలని వెక్కిరిస్తూ తీసిన ఈ థాయ్ సినిమా చూశారా?

ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ఆ కోటలో సినిమా షూటింగ్… 34 ఏళ్ల వయసులో 330 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమా తీసిన లేడీ డైరెక్టర్ కథ

రాజు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఒక్కటైన సామాన్యులు.. రాబిన్‌హుడ్ స్టోరీకి పునాదిగా మారిన అసలైన చారిత్రక పోరాటం

ఆసుపత్రి బెడ్‌పైనే దారుణ హత్య… షాకింగ్ రియల్ మర్డర్ ఆధారంగా రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ

భర్త ఉండగానే మరొకరితో… కెమెరా ముందే బట్టబయలైన నిజాలు… క్రేజీ కొరియన్ రిలేషన్‌షిప్ డ్రామా

గ్యాస్ స్టేషన్ నుంచి గ్రాండ్ బ్యాంక్ రాబరీ దాకా… అందమైన మోసగాడితో యువతి కిరాక్ క్రైమ్ జర్నీ

విమాన ప్రమాదం… మంచు అరణ్యంలో ఒంటరి పోరాటం… కదిలించే సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×