OTT Movie : కొన్ని హారర్ సినిమాలను గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాలి అన్నట్టుగా ఉంటాయి. ఎవరినైనా తోడు పెట్టుకుని ఇటువంటి సినిమాలు చూస్తారు. అంతలా భయపెట్టే సన్నివేశాలు కొన్ని సినిమాలలోనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక రైతు కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబం ఒక దెయ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో
ఈ థాయ్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెత్ విస్పరర్’ (Death Whisperer). 2023 లో విడుదలైన ఈ మూవీకి థావీవాట్ వాంటా దర్శకత్వం వహించారు.ఇందులో నాడెచ్ కుగిమియా, రత్తనవాడీ వాంగ్‌థాంగ్, డెనిస్ జెలిల్చా కపౌన్, కర్జ్ డిట్ జైదీ, పీరకిత్ పచ్చరబున్యాకియాట్, అరిసర వాంగ్‌చలీ వంటి నటులు నటించారు. ఈ స్టోరీ థాయ్‌లాండ్‌లోని కాంచనబురి ప్రాంతంలో 1972లో జరుగుతుంది. ఈసినిమా క్రిట్టనన్ అనే రచయిత నవల ఆధారంగా రూపొందింది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
థాయ్ లాండ్ లోని ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉంటుంది. ఇందులో తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులు (యాక్, యోస్, యోడ్), ముగ్గురు కూతుళ్లు (యాడ్, యామ్, యీ) ఉంటారు. గ్రామంలో నార్ట్ అనే అమ్మాయి అనారోగ్యంతో చనిపోతుంది. ఒక రోజు ముగ్గురు కూతుళ్లు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా, చెట్టు కింద నల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ దెయ్యాన్ని చూస్తారు. ఆ తర్వాత, యామ్ ఒక వింత వృద్ధురాలిని చూసిన తర్వాత అనారోగ్యానికి గురవుతుంది. యామ్‌కు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లడం, ఎవరో తనకు హాని చేయడానికి వస్తున్నారని భయపడటం వంటివి చేస్తుంది. వైద్యులు దీన్ని సాధారణ జ్వరంగా చెప్పినప్పటికీ, ఆమె పరిస్థితి మాత్రం మరింత దిగజారుతుంది.
స్థానిక మంత్రగాడు యామ్‌ను ఒక దెయ్యం ఆవహించిందని, ఆ దెయ్యం సమీపంలో నివసించే ఒక వృద్ధురాలితో సంబంధం కలిగి ఉందని తెలియజేస్తాడు. ఈ కుటుంబంలో పెద్ద కొడుకు, మాజీ సైనికుడు అయిన యాక్ తన సోదరిని రక్షించడానికి గ్రామానికి తిరిగి వస్తాడు. ఈ దెయ్యం నుండి యామ్‌ను కాపాడటానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. కానీ ఈ క్రమంలో వారు భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. చివరికి యామ్‌ను దెయ్యం బారిన పడకుండా కుటుంబ సభ్యులు కాపాడతారా ? యామ్ కు నిజంగానే దెయ్యం పడుతుందా ? అ దెయ్యం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : బాక్సింగ్ రింగ్ లో భీకర పోరాటం … ఒక్కో పంచ్ కి వణుకుతున్న ఓటీటీ