OTT Movie : ఇప్పుడు మలయాళం సినిమాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో ఈ సినిమాలను చూడకపోయినా, ఓటీటీలో మాత్రం వదలకుండా చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన మలయాళం సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఇద్దరు బాక్సర్ లు రింగ్ లోకి దిగాల్సి వస్తుంది. అ తరువాత ఫైట్ ఒక యుద్ధంలా సాగుతుంది. థియేటర్లలో వచ్చిన రెండునెలల తరువాత, రీసెంట్ గానే ఓటీటీ లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. స్పోర్ట్స్ డ్రామా తో తెరకెక్కిన ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
ఆషిక్ అబు అనే వ్యక్తి బాక్సింగ్ లో మంచి నైపుణ్యం కలిగి ఉంటాడు. ఇతను గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా, బాక్సింగ్ కి దూరంగా ఉంటాడు. అతను ఇప్పుడు నిర్లక్ష్యపు జీవితం గడుపుతూ, సెలెబ్రిటీలకు బౌన్సర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య షెరిన్ ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. వీళ్లిద్దరికి సఫా అనే ఒక కుమార్తె కూడా ఉంటుంది. వీళ్ళంతా ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతుంటారు. అయితే ఆషిక్ జీవితంలో ఇప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. ఆషిక్ ఒక సందర్భంలో ప్రఖ్యాత టర్కిష్ బాక్సర్ సైనుల్ అఖ్మదోవ్ తో గొడవకు దిగుతాడు. ఈ గొడవ ఒక సవాల్‌గా మారి, ఆషిక్‌ను మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి తీసుకొస్తుంది. అతను ఈ బాక్సింగ్ మ్యాచ్ కోసం మళ్ళీ కఠిన శిక్షణ తీసుకుంటాడు. ఈ పోరాటం కేవలం బాక్సింగ్ మాత్రమే కాదు, అతని జీవితానికి ఒక అర్థం వచ్చేదిగా మారుతుంది. ఇందులో ఆషిక్, సైనుల్ అఖ్మదోవ్ అనే ఈ శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కోవలసి వస్తుంది. చివరికి ఆషిక్ బాక్సింగ్ రింగ్ లో విజయకేతనం ఎగరేస్తాడా ? ప్రత్యర్థి చేతిలో ఓడిపోతాడా ? అతను బాక్సింగ్ రింగ్ లో ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : చావు కూడా భయపడే రేంజ్ లో సైకో టార్చర్… భయంతో నరాలు కట్ అయ్యే హర్రర్ మూవీ మావా… చూస్తే వారం నిద్ర పట్టదు
జీ 5 (ZEE5)లో
ఈ మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ పేరు ‘దవీద్'(Daveed). 2025 లో వచ్చిన ఈ మూవీకి గోవింద్ విష్ణు దర్శకత్వం వహించారు. దీనిని ఏబీ అలెక్స్ అబ్రహం, టామ్ జోసెఫ్, సెంచరీ మాక్స్ జాన్ & మేరీ ప్రొడక్షన్స్, పనోరమా స్టూడియోస్ కలసి నిర్మించారు.ఇందులో ఆంటోని వర్గీస్, లిజోమోల్ జోస్, విజయరాఘవన్, సైజు కురుప్, కిచ్చు టెల్లస్ వంటి నటులు నటించారు. ఈ మూవీ స్టోరీ ఆషిక్ అబు అనే మాజీ బాక్సర్ చుట్టూ తిరుగుతుంది. తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది. 2025, ఫిబ్రవరి 14 న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఏప్రిల్ 18 నుంచి ఈ మూవీ జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.