BigTV English

OTT Movie : ఎవడితో పడితే వాడితో ఏకాంతంగా గడిపే భార్య… అది తెలిసి భర్త చేసే పని చూస్తే గుండెల్లో గుబులు పుట్టాల్సిందే

OTT Movie : ఎవడితో పడితే వాడితో ఏకాంతంగా గడిపే భార్య… అది తెలిసి భర్త చేసే పని చూస్తే గుండెల్లో గుబులు పుట్టాల్సిందే

OTT Movie : రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో కొన్ని సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తాయి. ఈ సినిమాలలో ఏకాంతంగా గడిపే సీన్స్ తో పాటు, క్రైమ్ కూడా ఉంటుంది. మూవీ లవర్స్ ని ఈ సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్తే…


హులు (Hulu) లో

ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డీప్ వాటర్‘ (Deep water). ఈ మూవీలో భార్య బాయ్ ఫ్రెండ్స్ తో ఎక్కువగా గడుపుతుంది. అలా గడిపిన తరువాత, ఒక్కొక్కరిని భర్త చంపుతూ ఉంటాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), హులు (Hulu) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2022 లో ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి అడ్రియన్ లైన్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీలో  బెన్ అఫ్లెక్, అనా డి అర్మాస్ నటించారు. COVID-19 మహమ్మారి కారణంగా అనేక జాప్యాలు జరిగిన తర్వాత, మార్చి 18, 2022న హులులో డీప్ వాటర్  మూవీని విడుదల చేశారు.


స్టోరీ లోకి వెళితే

విక్, మిలిండా అనే భార్యాభర్తలు ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ భార్య జో అనే వ్యక్తితో చాలా క్లోజ్ గా ఉంటుంది. అక్కడ మిలిండాను జో తో చూసిన జనం విక్ పై అదోలా చూస్తారు. భార్య వేరొకరితో అలా డాన్స్ వేస్తుంటే, సైలెంట్ గా ఉండడం చూసి చాలా గొప్ప మనసు అంటూ పొగుడుతారు. అయితే జో దగ్గరికి విక్ వెళ్లి, ఇదివరకే తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఇంకా కనపడట్లేదని చెప్తాడు. అతన్ని చంపింది నెనే అని అతనికి చెప్పి బెదిరిస్తాడు. అయితే జో ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది మిలిండా. వాళ్ళిద్దరూ భర్త ఉండగానే బెడ్రూంలో గడుపుతారు. ఇది చూసిన విక్ చాలా బాధపడతాడు. ఆ తరువాత విక్, జో ని చంపేస్తాడు. ఆ తర్వాత మిలిండా, చార్లీ అనే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంతుంది. అతడు పియానో టీచర్ గా మిలిండాకి టీచింగ్ చేస్తుంటాడు. భర్తని పట్టించుకోకుండా అతనితో రొమాంటిక్ డాన్స్ వేస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో చార్లీని నీళ్లల్లోనే ముంచి  చంపేస్తాడు విక్.

అయితే ఆ తర్వాత ఇవన్నీ భర్త చేస్తున్నాడని అనుకుంటుంది భార్య. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అయితే భార్య ఇలా ఎందుకు చేస్తుందో విక్ కి అర్థం కాదు. చివరికి చిన్ననాటి స్నేహితుడైన టోనీతో రిలేషన్ పెట్టుకుంటుంది మిలిండా. మొదటిసారి వర్జినిటీ కోల్పోయింది ఇతనితోనే అని భర్తకి చెప్తుంది. విక్ ఇది విని ఇంకా డిసప్పాయింట్ అవుతాడు. ఆ తరువాత టోనీ నెత్తి మీద ఒక బండ రాయి వేసి చంపేస్తాడు. ఈ విషయం విక్ అంకుల్ కి కూడా తెలుస్తుంది. పోలీసులకు చెప్పదామనుకునేలోగా, అంకుల్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. చివరికి విక్ పోలీసులకు దొరుకుతాడా? భార్య ఈ రిలేషన్లు ఎందుకు పెట్టుకుంటుంది? భార్య మీద ప్రేమతోనే అంతమందిని చంపాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×