Anasuya Bharadwaj : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ.. ఈమె యాంకర్ గా మొదట్లో కెరియర్ని ప్రారంభించిన ఆ తర్వాత సినిమాల్లో బిజీగా మారింది. ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది. ఇటీవల వచ్చిన పుష్ప 2 మూవీలో కీలక పాత్రలో అనసూయ కనిపించి అలరించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమె రెంచే మారిపోయిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఇక అనసూయ ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను మాత్రం పోస్ట్ చేయకుండా అస్సలు ఉండదు. హాట్ డ్రస్సుల్లో ఘాటుగా కామెంట్స్ అందుకుంటూ నెటిజెన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ నిత్యం ఏదో ఒక విధంగా హైలైట్ అవుతూ ఉంటుంది.. అయితే ఇప్పుడు అనసూయ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వయసు పెరుగుతున్న తరగని అందంతో వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్.. ఒకప్పుడు యాంకర్ గా యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె ఇప్పుడు సినిమాలో పలు కీలక పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నది. అనసూయ ఏది పోస్ట్ చేసిన ట్రెండ్ అవుతుంది. అనసూయ గురించి ఇప్పుడు ఓ వార్త వినిపిస్తుంది. అదేంటంటే ఆమె పెళ్లి గురించి ఆమె భర్త ఏం చేస్తాడా అని ఫాన్స్ గూగుల్లో వెతికేస్తున్నారు.. నిజానికి అనుకు పెళ్లై అప్పుడే 14 యేళ్లు అవుతోంది. అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.ఆమె కాలేజ్ డేస్ లో ఎన్ సీ సీలో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది.. అను భర్త భరద్వాజ్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు.. ఆమె భర్తతో ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇక ఈమె కెరియర్ విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ మూవీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు న్యూస్ ప్రజెంటేటర్ గా వర్క్ చేసింది.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా పరిచయమైంది. పలు షోలు చేసింది అందులో జబర్దస్త్ మాత్రం ఆమెకు మంచి లైఫ్ ని ఇచ్చిందనే చెప్పాలి. తర్వాత నటిగా బిజీ అయిపోయింది. కుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ పాత్ర సినిమాకు హైలెట్ అవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది.. ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే తాను నటిస్తోన్న కారణంగా ఇపుడు జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పేసింది. గతేడాది పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన అనసూయ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించి మెప్పించింది. అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది.. రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప 2తో ప్రేక్షకులను పలకరించింది.. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం..