Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ గురించి దేశావ్యాప్తంగా ఉత్కంట నెలకొంది. ఈ మూవీ భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లోకి వచ్చేసింది. ఇప్పటికే పలుచోట్ల బుకింగ్స్ పూర్తయిపోయింది. సినిమా టికెట్లు హాట్ కేకు లాగా అమ్ముడు అయ్యాయి. అయితే ఈ మూవీ మీద పుష్ప 2, దేవర అంత హైప్ కూడా లేదన్న సంగతి తెలిసిందే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కన్నా ముందు ఇండియన్ టు సినిమాను చేశాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తో గేమ్ ఛేంజర్ మీద అంతగా అంచనాలు లేవని తెలుస్తుంది.. ఇక గేమ్ చేంజర్‌కు ఉన్న హైప్, హోప్ కేవలం రామ్ చరణ్ మాత్రమే. రామ్ చరణ్ పేరు మీదే ప్రతీ టికెట్ తెగాల్సి ఉంటుంది. ఓపెనింగ్స్ మొత్తం రామ్ చరణ్ భుజాల మీదే వేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో మరో వార్త ప్రచారంలో ఉంది. గేమ్ చేంజర్ మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టొచ్చు అనేది అంచనా వేస్తున్నారు.. ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి..
రామ్ చరణ్ సినిమాల ఓపెనింగ్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో నటించిన సినిమాల గురించి ఆ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సినిమా టాకుతో ఎటువంటి సంబంధం లేకుండా కలెక్షన్స్ ను కొల్లగొట్టేది. ఇప్పుడు లెక్క మారింది. ఈ సినిమాకు టార్గెట్ గా రెండు సినిమాలు లైన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన దేవర, అల్లు అర్జున్ నటించిన పుష్ప2.. ఇందులో పుష్ప 2 రికార్డుల్ని టచ్ చేయడం సాధ్యం కాదు. పుష్ప 2 ఇండియాలో ప్రస్తుతం ఏ సినిమాకీ అందనంత ఎత్తులో ఉంటుంది. పుష్ప 2 ఓపెనింగ్స్, లాంగ్ రన్ రికార్డుల్ని కదిలించాలంటే జక్కన్న కే అది సాధ్యం అవుతుంది. పుష్ప 2 2000 కోట్లకు దగ్గర్లో ఉంది.. త్వరలోనే ఆ రికార్డును కూడా కంప్లీట్ చేసే అవకాశాలున్నాయని సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది..
‘గేమ్ ఛేంజర్ ‘ మొదటి రోజు టార్గెట్..
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవరకు మొదటి రోజు 172 కోట్లకు పైగానే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి మిడ్ నైట్ షోలు కూడా పడ్డాయి. టికెట్ రేట్లు కూడా ఎక్కువే. కానీ గేమ్ చేంజర్‌కు మిడ్ నైట్ షోలు లేవు. టికెట్ ధరలు అంతగా ఎక్కువగా ఏమి లేవన్న సంగతి తెలిసిందే.. గేమ్ చేంజర్ మాత్రం బుకింగ్స్‌లో దుమ్ములేపేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటిందని అంటున్నారు. చూస్తుంటే డే వన్ విషయంలో గేమ్ చేంజర్ మంచి కలెక్షన్స్ ను అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ డే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. గేమ్ చేంజర్ మొదటి రోజు 170 నుంచి 180 కోట్లకు పైగానే రాబట్టేలా కనిపిస్తోంది. తమిళంలో, ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు వచ్చేలా కనిపిస్తోంది. మరి అంత టార్గెట్ ను రీచ్ అవుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా ఏపీలో 1 నుంచే షోలు పడ్డాయి. ప్రస్తుతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.. ఇక ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి..