BigTV English

OTT Movie : నవ వధువుతో తెల్లార్లూ అదే పని… ఇదెక్కడి దిక్కుమాలిన దుష్టశక్తి… ఈ దెయ్యం అరాచకాన్ని తట్టుకోవడం కష్టం సామీ

OTT Movie : నవ వధువుతో తెల్లార్లూ అదే పని… ఇదెక్కడి దిక్కుమాలిన దుష్టశక్తి… ఈ దెయ్యం అరాచకాన్ని తట్టుకోవడం కష్టం సామీ

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలను చూడాలంటే కొంచె గుండె ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాలు ఆడియన్స్ ని గజగజా వనికిస్తాయి. చేతబడులు, ఆత్మలు వంటి థీమ్స్ ను, ఈ సినిమాలు రియలిస్టిక్ గా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక హారర్ సినిమాను తీయడం జరిగింది. ఒక యువతికి పెళ్లి జరిగిన తర్వాత దెయ్యం భయాలు ఎక్కువ అవుతాయి. ఆమె దీని నుంచి ఎలా బయటపడిందనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

‘దాసిమ్’ (Dasim) ఒక ఇండోనేషియన్ హారర్ సినిమా. దీనికి గినాంతి రోనా దర్శకత్వం వహించారు. ఇందులో సల్మా (జుల్ఫా మహారాని), ఆర్మాన్ (ఓమర్ డానియల్), ఆర్మాన్ అమ్మ (మేరియం బెల్లినా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 15న ఇండోనేషియా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

సల్మా, ఆర్మాన్ అనే జంటకి కొత్తగా పెళ్లి అవుతుంది. వాళ్లు ఇప్పుడు హ్యాపీ మూడ్ లో ఉంటారు. సల్మా మూడు నెలలు తిరక్కుండానే గర్భవతి కూడా అవుతుంది. ఈ సమయంలో ఆర్మాన్‌కు ఆఫీసులో ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అతను ఆ ప్రాజెక్ట్ కోసం రేయింబవళ్ళు పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సల్మాను ఆర్మాన్ తన అమ్మ ఇంటిలో వదిలి ఆఫీసుకి వెళ్తాడు. కానీ అక్కడ సల్మాకు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తాయి. ఇంట్లో ఏవో శబ్దాలు వినిపిస్తాయి. వీటి గురించి ఆర్మాన్‌కు సల్మా చెప్పినా, అతను బిజీగా ఉండి సీరియస్‌గా తీసుకోడు. ఈ సంఘటనల వల్ల ఆమె ఆర్మాన్ అమ్మతో కూడా గొడవ పడుతుంది. ఆమె భయాలు రోజు రోజుకూ పెరుగుతాయి. ఎవరో తనను చూస్తున్నట్టు ఫీల్ అవుతుంది.


Read Also : ఫస్ట్ నైట్ రోజే పరలోకానికి… పెళ్లి కొడుకుకి ఫ్యూజులు అవుటయ్యే షాక్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

ఆమెకు ఆర్మాన్ తనని మోసం చేస్తున్నాడని అనుమానం వస్తుంది. ఎందుకంటే అతను ఎక్కువ టైమ్ బయటే ఉంటాడు. ఇక స్టోరీ నడిచే కొద్ది, ఇంట్లో దాసిమ్ అనే దెయ్యం వెంటాడుతోందని సల్మాకు అర్థమవుతుంది. ఈ దెయ్యం ఇండోనేషియన్ లో ఫ్యామిలీలను నాశనం చేసే దెయ్యంగా చెప్పుకుంటారు. సల్మా ఈ దాసిమ్ దెయ్యం గురించి తెలుసుకుంటుంది. ఈ దెయ్యం ఆర్మాన్ గతం వల్ల తనని వెంటాడుతోందని సల్మాకు తెలుస్తుంది. ఇక కథ భయంకరమైన ట్విస్టుతో మలుపు తీసుకుంటుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఆర్మాన్ గతం ఏమిటి ? దెయ్యం సల్మాను ఎందుకు వెంటాడుతోంది ? ఈ దెయ్యం నుంచి సల్మా బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : బతికుండగానే మనుషుల్ని మటన్ లా తినేసే సైతాన్… వెన్నులో వణుకు పుట్టించే మూవీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి అమ్మాయిపై అలాంటి కోరికలు… అన్నీ అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు భయ్యా

OTT Movie : పేదమ్మాయిపై ప్రేమ… మొత్తం మత్తెక్కించే సీన్లే భయ్యా… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : భార్య శవం మిస్సింగ్… భర్తతో పాటు అతని ప్రేయసికీ చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్టు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డెడ్ బాడీ తలలో క్యాప్సిల్… హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ మావా

OTT Movie : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?

OTT Movie : ఆన్లైన్ లో రీసెల్లింగ్… అర్ధరాత్రి వింత సంఘటనలు… మాస్క్ మ్యాన్ మిస్టరీతో మతిపోగోట్టే సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×