BigTV English

OTT Movie : పేదమ్మాయిపై ప్రేమ… మొత్తం మత్తెక్కించే సీన్లే భయ్యా… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : పేదమ్మాయిపై ప్రేమ… మొత్తం మత్తెక్కించే సీన్లే భయ్యా… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : సినిమా ప్రపంచంలోనే కాదు, మనిషి జీవితంలో కూడా ప్రేమ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక అందమైన ప్రేమ కథను వింటున్నా , చూస్తున్నా మంచి అనుభూతి కలుగుతుంది. లవ్ స్టోరీలతో ఎన్నో అదిరిపోయే సినిమాలు వచ్చాయి. ఇక పై కూడా వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ వన్ సైడ్ లవ్ తో మొదలై, బ్రేక్ అప్ వరకూ వెళ్తుంది. అయితే క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా బెస్ట్ సజెషన్. అయితే రొమాంటిక్ సీన్స్ లో కాస్త మసాలా ఉండటంతో, ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది.  ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను, తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘థ్రూ మై విండో’ (Through my window) 2022లో వచ్చిన స్పానిష్ రొమాంటిక్ సినిమా. మార్కల్ ఫోరెస్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రాక్వెల్ (క్లారా గాల్లే), ఏరెస్ (జూలియో పెన్యా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 గంట 49 నిమిషాల రన్ టైమ్ తో, IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

రాక్వెల్ అనే 17 ఏళ్ల అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆమె తన ఇంటికి పక్కనే ఉండే ఏరెస్‌ అనే అబ్బాయిని పిచ్చిగా ప్రేమిస్తుంది. అయితే ఇది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది. ఏరెస్ హ్యాండ్సమ్ గా ఉండటమే కాకుండా, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇప్పుడు రాక్వెల్ అతని గురించి తెలుసుకోవడానికి, అతని వైఫై పాస్‌వర్డ్ హ్యాక్ చేస్తుంది. అతని మెసేజెస్ ను కూడా చదువుతుంది. రాక్వెల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమె తన తల్లి, తండ్రి, సోదరుడితో ఉంటుంది. ఏరెస్ తన బ్రదర్ ఆర్టెమిస్‌తో ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు. రాక్వెల్ ఏరెస్‌తో మాట్లాడాలని, అతని ప్రేమ పొందాలని కలలు కంటుంది. ఒక రోజు ఏరెస్ ఆమెను గమనిస్తాడు. ఆమె మనసులో ఏముందో తెలుసుకుంటాడు. వాళ్ల మధ్య చిన్న చిన్న రొమాన్టిక్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక రాక్వెల్, ఏరెస్ మధ్య ప్రేమ మొదలవుతుంది. వాళ్లు కలిసి సీక్రెట్ గా టైమ్ స్పెండ్ చేస్తుంటారు.


Read Also : భార్య ఉండగా ఇదెక్కడి దిక్కుమాలిన పని… మొగుడు మగాడే కాదని తెలిస్తే… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

ఈ విషయం ఏరెస్ ఫ్యామిలీకి తెలుస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఈ ప్రేమను ఒప్పుకోరు. ఎందుకంటే ఆమె మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావడమే అందుకు కారణం. ఏరెస్ కూడా తన ఫ్యామిలీ రూల్స్ వల్ల రాక్వెల్‌తో ఓపెన్‌గా ఉండలేడు. అయితే వాళ్లు ఒకసారి అనుకోకుండా ఏకాంతంగా గడుపుతారు. ఇక పని అయిపోవడంతో ఏరెస్ రాక్వెల్‌ను దూరం పెడతాడు. దీంతో రాక్వెల్ చాలా బాధపడుతుంది. కానీ అతన్ని మాత్రం వదులుకోకుండా వెంట పడుతుంది. అయితే ఏరెస్ తన ఫ్యామిలీ ప్రెషర్ వల్ల రాక్వెల్‌ను అవాయిడ్ చేస్తాడు. రాక్వెల్ ఈ సమయంలో ఏరెస్‌తో జరిగిన తన ప్రేమ కథను ఒక బుక్‌గా రాస్తుంది. ఆ కథకి ‘థ్రూ మై విండో’ అనే పేరు పెడుతుంది. ఒకరోజు ఏరెస్ ఆమె రాసిన బుక్‌ను చదివి బాగా ఎమోషనల్ అవుతాడు. అతను ఒక నిర్ణయానికి వస్తాడు. ఈ నిర్ణయంతో స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఏరెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? చివరికి వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? ఈ స్టోరీకి శుభం కార్డ్ పడుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : బతికుండగానే మనుషుల్ని మటన్ లా తినేసే సైతాన్… వెన్నులో వణుకు పుట్టించే మూవీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి అమ్మాయిపై అలాంటి కోరికలు… అన్నీ అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు భయ్యా

OTT Movie : నవ వధువుతో తెల్లార్లూ అదే పని… ఇదెక్కడి దిక్కుమాలిన దుష్టశక్తి… ఈ దెయ్యం అరాచకాన్ని తట్టుకోవడం కష్టం సామీ

OTT Movie : భార్య శవం మిస్సింగ్… భర్తతో పాటు అతని ప్రేయసికీ చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్టు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డెడ్ బాడీ తలలో క్యాప్సిల్… హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ మావా

OTT Movie : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?

OTT Movie : ఆన్లైన్ లో రీసెల్లింగ్… అర్ధరాత్రి వింత సంఘటనలు… మాస్క్ మ్యాన్ మిస్టరీతో మతిపోగోట్టే సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×