OTT Movie : ప్రేమ కథలు ఎప్పటికీ బోర్ కొట్టవు. ఇందులో ఉన్న మహత్యమే గమ్మత్తుగా ఉంటుంది. అది ప్రేమలో ఉన్న వాళ్ళకే ఇంకా బాగా తెలుస్తుంది. సినిమాలలో ఈ కథలకు కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక లవ్ స్టోరీ, ఆడియన్స్ ని ప్రేమ మత్తులో ముంచుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రేమకథ డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది ఒక అమ్మాయి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆమెకు ఈ కొత్త హార్ట్ వల్ల కొత్త అలవాట్లు రావడంతో ఆమె లైఫ్ పూర్తిగా మారిపోతుంది. దీంతో ఆమె ప్రేమ కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో కి వచ్చింది. హాట్ సీన్స్ బాగానే ఉంటాయి. కాబట్టి ఈ మూవీని సింగిల్ గా చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘కిరోట్’ (Kirot) 2025లో వచ్చిన ఫిలిప్పైన్ డ్రామా సినిమా. బాబీ బోనిఫాసియో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో లారా (ఆష్లీ లోపెజ్), రాయ్ (జెన్ రోసా), జెస్సీ (జేసి టాన్), రినోవా (రినోవా హాలిలి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 21న వివామాక్స్‌లో రిలీజ్ అయింది. IMDbలో 5.9/10 రేటింగ్ పొందింది.
లారా మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి. తన హైస్కూల్ ప్రియుడు రాయ్ ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె లైఫ్ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే లారాకు అకస్మాత్తుగా హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. దీంతో ఆమెకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఆ తరువాత ఆమెకు ఆపరేషన్ కూడా జరుగుతుంది. కొద్ది రోజుల్లో మళ్ళీ కోలుకుంటుంది. కానీ కొత్త హార్ట్ వల్ల ఆమెకు విచిత్రమైన ఫీలింగ్స్, కోరికలు మొదలవుతాయి. ఆమె పాత లైఫ్ కి, ఈ కొత్త ఫీలింగ్స్ కి చాలా తేడా ఉంటుంది. ఆమెకు అబ్బాయిల మీద కంటే, అమ్మాయిలమీద కోరిక కలుగుతుంటుంది. దీంతో మనసు ఇప్పుడు గందరగోళంగా మారుతుంది. రాయ్‌తో పెళ్లి గురించి కూడా ఆమె డౌట్‌లో పడుతుంది.
Read Also : భర్త పట్టించుకోట్లేదని మరొకడితో… ప్రియుడితో కలిసి మైండ్ ను మడతబెట్టే ప్లాన్ సామీ