Telugu Thriller Series: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం దాచుకున్న డబ్బును క్షణాల్లో పోగొట్టే పరిస్థితి తీసుకొస్తోంది. ప్రతిరోజూ OTP స్కామ్‌లు, ఫిషింగ్ కాల్స్, ఫేక్ లింకులు, బ్యాంక్ మోసాల గురించి వింటూనే ఉన్నా… అవి ఎలా జరుగుతాయో చాలామందికి పూర్తిగా తెలియదు. అలాంటి ఓటీపీ మోసాల వెనుక దాగి ఉన్న చీకటి ప్రపంచాన్ని ఉత్కంఠభరితంగా చూపించే మైక్రో థ్రిల్లర్ సిరీస్ Dhandha. ఈ తెలుగు సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రముఖ యూట్యూబర్ దొరసాయి తేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ కేవలం రెండు నిమిషాల లోపే ముగిసినా, చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ ప్లే చేసేలా చేస్తుంది. సస్పెన్స్‌తో పాటు సమాజానికి అవసరమైన అవగాహనను కూడా అందించే ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
అరవింద్ అనే బీటెక్ విద్యార్థి జీవితంలో పెద్దగా గోల్స్ ఉండవు. ఎలాగైనా త్వరగా డబ్బు సంపాదించి రాజకీయాల్లో సెటిల్ అవ్వాలనే కలతో జీవిస్తుంటాడు. చదువుకంటే సులభంగా డబ్బు వచ్చే మార్గాలపైనే ఎక్కువ దృష్టి పెడతాడు. అదే ఆలోచన అతన్ని క్రమంగా డార్క్ వెబ్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడ చాలా తక్కువ ధరకే వేలాది మంది వ్యక్తిగత వివరాలు అమ్ముతున్నారని తెలుసుకున్న తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది.
కేవలం రూ.150 ఖర్చు చేసి యూజర్ల డేటాను కొనుగోలు చేసిన అరవింద్, ఒకే ఒక్క ఓటీపీ కాల్‌తో బ్యాంక్ ఖాతాలను ఎలా ఖాళీ చేయవచ్చో నేర్చుకుంటాడు. మొదట చిన్న చిన్న మోసాలతో మొదలైన అతని ప్రయాణం క్రమంగా భారీ సైబర్ నేరాల వైపు వెళ్తుంది. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, సోషల్ ఇంజినీరింగ్, బ్లాక్‌మెయిల్ వంటి పద్ధతులతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడటం మొదలుపెడతాడు.
డబ్బు పెరిగే కొద్దీ అతని పరిచయాలు కూడా మారిపోతాయి. సాధారణ హ్యాకర్‌గా మొదలైన అరవింద్ ప్రయాణం గ్యాంగ్‌స్టర్ల వరకు చేరుతుంది. రాజకీయ నాయకులు, క్రిమినల్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ మాఫియాలతో అతనికి సంబంధాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో అతని జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. అతను నిర్మించిన సైబర్ సామ్రాజ్యం ఎంత పెద్దదైంది ? అతని తెలివితేటలే చివరకు అతనికి ప్రమాదంగా మారాయా ? చట్టం అతన్ని పట్టుకుందా ? లేక మరింత ప్రమాదకరమైన ప్రపంచంలోకి వెళ్లిపోయాడా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్రస్తుతం ‘దందా’ సిరీస్ Chai Shots Appలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ రెండు నిమిషాల లోపే ఉన్నా, కథ చెప్పిన తీరు మాత్రం సినిమా స్థాయిలో ఉంటుంది. సుమారు 50 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ మైక్రో సిరీస్‌లో మేకింగ్ క్వాలిటీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. దొరసాయి తేజతో పాటు అక్షర నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ తదితరులు ఇందులో నటించారు. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే సస్పెన్స్ ట్విస్ట్‌లు హైలెట్ గా నిలుస్తాయి.
సైబర్ క్రైమ్ థ్రిల్లర్లు, వేగవంతమైన కథలు, షార్ట్ ఫార్మాట్ వెబ్ సిరీస్‌ల కోసం ఓటీటీలో వెతుకుతుంటే… ‘దందా’ తప్పకుండా మీ వాచ్‌లిస్ట్‌లో ఉండాల్సిన సిరీస్. వినోదంతో పాటు డిజిటల్ మోసాలపై అవగాహన కూడా కల్పించే ఈ మైక్రో థ్రిల్లర్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన కంటెంట్‌గా నిలుస్తోంది. ఒక్క ఓటీపీని కూడా నిర్లక్ష్యంగా చెప్పకూడదనే బలమైన సందేశాన్ని ఇస్తూ, చివరి వరకు సస్పెన్స్ తో కట్టిపడేసే ఈ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
Read Also: కేర్ టేకర్ గా వచ్చి కిల్లింగ్ పనులు… తెలుగులోనే ఈ మోస్ట్ అవైటింగ్ మలయాళం థ్రిల్లర్ స్ట్రీమింగ్