Romantic Anthology Drama: పెళ్లి తర్వాత కూడా మనసులోని కోరికలు చచ్చిపోతే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా ? ఆ ఎంప్టీని ఇంకొక వ్యక్తి భర్తీ చేస్తే ? ఆఫీసులో బాస్, జూనియర్ మధ్య మొదలైన ఆకర్షణ తర్వాత పవర్ గేమ్ గా మారితే ? సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నమ్మి డేట్ కు వెళ్లిన మహిళకు ఊహించని అనుభవం ఎదురైతే ? వయసు పెరిగిన తర్వాత కూడా ప్రేమ, ఆకర్షణకు చోటు ఉంటుందా ? ఇలాంటి అసౌకర్యమైన, వాస్తవికమైన ప్రశ్నలను నాలుగు వేర్వేరు కథలుగా చెప్పే ఆంథాలజీ మూవీ ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3). తాజాగా తెలుగులో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు అంటే…
ఈ సిరీస్‌లో ఒకే కథ ఉండదు. వేర్వేరు జీవితాల్లో జరిగే సంబంధాలు, ఆకర్షణలు, కోరికలు, భావోద్వేగాలను నాలుగు కథలుగా చూపిస్తారు. ప్రతి కథలోనూ మనుషులు బయటికి ఒకలా కనిపిస్తే… లోపల అనుభవించేది మరోటి అనే కోణాన్ని ప్రధానంగా తీసుకున్నారు. మొదటి కథలో పెళ్లయి చాలా సంవత్సరాలు గడిచిన ఓ గృహిణి తన వైవాహిక జీవితంలో అసంతృప్తితో ఇబ్బంది పడుతుంది. ఇంట్లోకి వంట మనిషిగా వచ్చిన ఓ యువకుడితో ఏర్పడే పరిచయం క్రమంగా రహస్య బంధంగా మారుతుంది. ఆ అనుబంధం బయటపడే పరిస్థితి రావడంతో ఆమె కుటుంబంలో నమ్మకం, అనుమానం, అపరాధ భావన అన్నీ గందరగోళం క్రియేట్ చేస్తాయి. ఒక చిన్న నిర్ణయం మొత్తం కుటుంబాన్ని ఎలా కుదిపేస్తుందనేది ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుంది.
రెండో కథ కార్పొరేట్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక బాస్, అతని జూనియర్ మధ్య పని సందర్భంలో మొదలైన ఆకర్షణ క్రమంగా మరో రూపం దాల్చుతుంది. ఇక్కడ ప్రేమ కంటే అధికారమే ఎక్కువగా పని చేస్తుంది. ఎవరి మీద ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు ? వ్యక్తిగత బంధం, ప్రొఫెషనల్ పవర్ మధ్య గీత ఎక్కడ మాయమవుతుంది ? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.
మూడో కథలో చిన్న పట్టణానికి చెందిన ఓ ఒంటరి మహిళ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడిని కలవడానికి వెళ్తుంది. ఆన్‌లైన్ లో కనిపించిన వ్యక్తి నిజ జీవితంలో కూడా అంతే మంచివాడా అనే సందేహం ఆమెకు ఎదురయ్యే సంఘటనలతో మరింత బలపడుతుంది. ఆ అనుభవం ద్వారా సమాజం వేసుకున్న నకిలీ నీతి ముసుగులను కథ ద్వారా మన కళ్ల ముందు ఉంచారు.
నాలుగో కథ వయసైన జంట చుట్టూ తిరుగుతుంది. జీవితంలో బాధ్యతలు, కుటుంబం, సమాజం మధ్య నలిగిపోయిన వారి మధ్య ఒకప్పుడు మసకబారిన ఆకర్షణ మళ్లీ మొదలవుతుంది. అయితే దాన్ని సమాజం ఎలా చూస్తుంది ? వారి నిర్ణయాలను ఇతరులు ఎందుకు ప్రశ్నిస్తారు ? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. మరి ఈ నాలుగు కథలు చివరికి ఏ దిశలో వెళ్తాయి ? బంధాల విషయంలో సరైనది, తప్పు అని నిర్ణయించేది ఎవరు ? ప్రతి కథలోని పాత్రలు తీసుకునే నిర్ణయాల పరిణామాలు ఎలా ఉంటాయి ? అదే ఈ ఆంథాలజీ సిరీస్ కథ.
‘లస్ట్ స్టోరీస్ 3’కి విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించగా… నాలుగు డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ, రాధికా ఆప్టే, విజయ్ వర్మ, కొంకణా సేన్ శర్మా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఆంథాలజీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా చూడొచ్చు.
Read Also: పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే