E-Paper
Advertisement

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్
Advertisement

Malayalam Action Thriller: ఇంట్లో ఉంటూ హోమ్ సైన్స్ చదువుకునే ఓ అమ్మాయి. తండ్రి మాత్రం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఓ వర్షం రాత్రి ఆయుధాలతో కొందరు క్రిమినల్స్ ఆ ఇంట్లోకి చొరబడతారు. తండ్రిని బంధించిన వాళ్లకు అసలు ప్రమాదం ఇంట్లోనే ఉందని తెలియదు. నిమిషాల వ్యవధిలో ఆ అమ్మాయి తనలో దాచుకున్న మరో యాంగిల్ ను బయటకు తీస్తే… సాధారణ ఇంటినే యాక్షన్ అరేనాగా మార్చే కథ ‘తొడక్కమ్’ (Thudakkam). మరి ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో తెలుగులో ఉంది ? అనేది తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…  

రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ వర్గీస్ తన కూతురు అంజలితో కలిసి కొండ ప్రాంతంలోని ఓ ఒంటరి బంగళాలో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. ఆర్మీలో ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న వర్గీస్ ఇప్పుడు గతాన్ని పక్కన పెట్టి, తన కూతురితో సాధారణ జీవితం గడపాలని కోరుకుంటాడు. అంజలి కూడా చాలా సాదాసీదా అమ్మాయిలా కనిపిస్తుంది. చదువుకుంటూ తన ప్రపంచంలో తాను ఉండే అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె జీవితంలో ఎలాంటి ప్రమాదకరమైన నేపథ్యం లేదనిపిస్తుంది. కానీ తండ్రి మాత్రం ఆమెకు చిన్నతనం నుంచే ఒక విషయం నేర్పిస్తూ వస్తాడు. అవసరమైనప్పుడు తనను తాను ఎలా కాపాడుకోవాలో మాత్రమే కాదు… శత్రువును ఎలా ఎదుర్కోవాలో కూడా రహస్యంగా శిక్షణ ఇస్తుంటాడు.

Advertisement

ఒక రాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో వారి ఇంటి చుట్టూ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆయుధాలతో వచ్చిన ఓ అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ బంగళాలోకి చొరబడుతుంది. వారికి కావాల్సింది వర్గీస్. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కావడంతో అతని గురించి కొన్ని రహస్యాలు తమకు తెలుసని భావించిన గ్యాంగ్ అతన్ని తీవ్రంగా గాయపరిచి బందీగా ఉంచుతుంది. వర్గీస్‌ ను బలహీనమైన అమ్మాయిగా భావించిన వాళ్లు… ఇంట్లో ఉన్న అంజలిని మాత్రం అసలు పట్టించుకోరు. ఆమెను సాధారణ అమ్మాయిగానే చూస్తారు. కానీ అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు అవుతుంది.

తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని అర్థం చేసుకున్న అంజలి భయపడదు. చిన్నప్పటి నుంచి తండ్రి ఇచ్చిన మిలిటరీ స్థాయి శిక్షణను ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని గ్రహిస్తుంది. ఇంట్లో కనిపించే సాధారణ వస్తువులు కూడా ఆమె చేతిలో ఆయుధాలుగా మారిపోతాయి. ఒక్కొక్కరిగా దాడి చేస్తున్న శత్రువులను ఎదుర్కొంటూ, ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తుంది.

Advertisement

ఇక్కడి నుంచి బంగళా మొత్తం ఒక యుద్ధభూమిగా మారుతుంది. బయట భారీ వర్షం, లోపల ఆయుధాలతో ఉన్న క్రిమినల్స్, మధ్యలో తన తండ్రిని కాపాడుకోవాల్సిన అంజలి. ఆమె ఎదుర్కొనే ప్రతి వ్యక్తి వెనుక మరో ప్రమాదం దాగి ఉంటుంది. అసలు వర్గీస్‌ ను ఎందుకు టార్గెట్ చేశారు ? అంజలికి ఇచ్చిన రహస్య శిక్షణ వెనుక ఉన్న అసలు కారణమేంటి ? గ్యాంగ్‌ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ? తండ్రిని కాపాడుతూ అంజలి ఈ రాత్రి నుంచి బయటపడగలదా ? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను చూడాల్సిందే. చివరి వరకు సస్పెన్స్ తో అదిరిపోతుంది మూవీ.

తెలుగులో చూడొచ్చా ?

విస్మయ మోహన్ లాల్ (Vismaya Mohanlal) ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మోహన్ లాల్ (Mohanlal), రోషన్ మాథ్యూ (Roshan Mathew) నటించిన ‘తొడక్కమ్’కు రోషన్ ఆండ్రూస్ (Rosshan Andrrews) దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంది. ఇంట్లోనే జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Read Also: డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×