Animated Series: హాకిన్స్ పట్టణంలో మరోసారి చీకటి అలుముకుంది. గతంలో జరిగిన వింత సంఘటనల నుంచి బయటపడిందనుకున్న నగరంలో, ఓ రహస్య ల్యాబ్ ఘటనతో అప్‌సైడ్ డౌన్ కు దారి మళ్లీ తెరుచుకుంటుంది. ఈసారి ఆ చీకటి ప్రపంచం నుంచి బయటకు వచ్చే జీవులు గతంలో కంటే ప్రమాదకరంగా ఉంటాయి. మరోవైపు ఎలెవన్ శక్తులు కూడా బలహీనపడుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. మైక్, డస్టిన్, లూకాస్, విల్ కలిసి ఈ కొత్త ప్రమాదం వెనుక ఉన్న అసలు శక్తిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. హాకిన్స్‌ను కాపాడేందుకు వాళ్లు చేసే సాహసమే ‘స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2’ (Stranger Things Tales from 85 – Season 2). మరి ఈ యానిమేటెడ్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
1985లో హాకిన్స్ పట్టణం చూడడానికి నార్మల్ గానే కనిపిస్తుంది. గతంలో జరిగిన వింత సంఘటనల తర్వాత అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి వచ్చారని అనుకుంటారు. కానీ పట్టణానికి కనిపించని మరో ప్రమాదం దగ్గర పడుతుంది. భూగర్భంలోని ఓ సైన్స్ ల్యాబ్‌లో జరిగే అనూహ్యమైన లీకేజ్ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన ప్రభావంతో అప్‌సైడ్ డౌన్ ప్రపంచానికి, హాకిన్స్‌కు మధ్య ఉన్న కనెక్షన్ మళ్లీ చురుగ్గా మారుతుంది. ఒకప్పుడు మూసుకుపోయిందనుకున్న మార్గం తిరిగి తెరుచుకోవడంతో అక్కడి నుంచి వింత జీవులు బయటకు వచ్చే ప్రమాదం మొదలవుతుంది.
ఈసారి హాకిన్స్ ఎదుర్కొనే జీవులు మరింత భయంకరంగా ఉంటాయి. రెక్కలతో ఎగరగలిగే డెమోగార్గన్ తరహా జీవులు నగరంలోకి రావడంతో ప్రజల్లో భయం మొదలవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని ఈ రాక్షసులు ఒక్కసారిగా దాడి చేసి అదృశ్యమవుతుంటాయి. ఈ పరిస్థితిలో ఎలెవన్ మరోసారి తన శక్తులను ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ఈసారి ఆమెకు మరో సమస్య ఉంటుంది. గతంలో ఉన్నంత బలం ఆమె శక్తుల్లో కనిపించదు. అయినా హాకిన్స్ ను కాపాడేందుకు వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు.
మైక్, డస్టిన్, లూకాస్, విల్ ఆమెతో కలిసి రహస్యానికి సమాధానం వెతుకుతారు. రాక్షసులు ఎక్కడి నుంచి వస్తున్నారు ? వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు ? వాటి వెనుక ఉన్న అసలు శక్తి ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఒక రహస్య యంత్రాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. వారి అన్వేషణ కొద్దికొద్దిగా హాకిన్స్ కింద దాగి ఉన్న మరో ప్రపంచాన్ని బయటకు తీసుకొస్తుంది. అక్కడ కనిపించే ఆధారాలు పరిస్థితి అనుకున్న దానికంటే చాలా పెద్దదని సూచిస్తాయి. ఒక్క తప్పు అడుగు కూడా మొత్తం టీమ్ ను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి వస్తుంది. ఎలెవన్ తన శక్తులను తిరిగి పూర్తిగా ఉపయోగించుకోగలదా ? పిల్లల టీమ్ ఆ మదర్ క్రిచర్ ను గుర్తించగలదా ? అప్‌సైడ్ డౌన్ నుంచి వచ్చిన ఈ కొత్త ప్రమాదం హాకిన్స్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ? చివరికి ఆ రహస్య పోరాటం ఎక్కడికి దారి తీస్తుందనేది సిరీస్‌లో చూడాల్సిందే.
‘స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2’కు డఫర్ బ్రదర్స్ (Duffer Brothers) క్రియేటర్స్. వాయిస్ కాస్ట్‌లో మిల్లీ బాబీ బ్రౌన్ (Millie Bobby Brown), ఫిన్ వోల్ఫ్‌హార్డ్ (Finn Wolfhard), గ్యాటెన్ మాతరాజో (Gaten Matarazzo) తదితరులు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ ఆడియోలతో అందుబాటులో ఉంది.
Read Also: పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే