E-Paper
Advertisement

కేర్ టేకర్ గా వచ్చి కిల్లింగ్ పనులు… తెలుగులోనే ఈ మోస్ట్ అవైటింగ్ మలయాళం థ్రిల్లర్ స్ట్రీమింగ్

కేర్ టేకర్ గా వచ్చి కిల్లింగ్ పనులు… తెలుగులోనే ఈ మోస్ట్ అవైటింగ్ మలయాళం థ్రిల్లర్ స్ట్రీమింగ్
Advertisement

Malayalam Psychological Thriller: కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్లు హత్యలతో భయపెట్టవు… మనిషి మనసులో దాగి ఉన్న గాయాలతో ఒక్కో క్షణం ఉత్కంఠ కలిగిస్తాయి. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, అప్పట్లో అర్థం కాని మాటలు… పెద్దయ్యాక జీవితాన్నే మార్చేసే నిజాలుగా మారితే ఎలా ఉంటుంది ? అలాంటి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది Balan The Boy. ‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ మలయాళ చిత్రం థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సస్పెన్స్‌తో పాటు తల్లీకొడుకుల బంధాన్ని భావోద్వేగంగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ? ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జైలు నుంచి విడుదలైన ఇందు అనే మహిళ… తన చిన్న కొడుకు బాలన్ తో కలిసి సమాజానికి దూరంగా బతుకుతుంది. ఒకేచోట ఎక్కువ రోజులు ఉండదు. తరచూ ఊర్లు మారడం, పేర్లు మార్చుకోవడం, అవసరమైతే మతం కూడా మార్చుకోవడం… ఇదే ఆమె జీవితం. ఎందుకు ఇలా చేస్తుందో మాత్రం తన కొడుకుకు చెప్పదు.

Advertisement

కొంత కాలానికి వీరిద్దరూ ఒక వృద్ధురాలి ఇంటికి కేర్‌టేకర్లుగా వెళ్తారు. వీల్‌చైర్‌కే పరిమితమైన ఆ మహిళను చూసుకోవడం మొదలు పెడతారు. కానీ ఆ ఇంట్లో గడిచే రోజులు ఎప్పటిలా మామూలుగా ఉండవు. తల్లి దాచిపెడుతున్న రహస్యాలు, బయట ప్రపంచానికి తెలియకూడని కొన్ని నిర్ణయాలు… బాలన్ చిన్న మనసులో ఎన్నో ప్రశ్నలు నింపుతాయి.

అంతలోనే ఆ ముసలావిడ చనిపోతుంది. ఆమె కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు. అతనికి విషయం చెప్పకుండా ఆ తల్లీకొడుకులు ఇద్దరూ ముసలావిడ ఇంట్లోనే ఉండిపోతారు. కొన్ని రోజులు చెప్పాపెట్టకుండా ఆ ముసలావిడ కొడుకు ఆస్ట్రేలియా నుంచి దిగడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

Advertisement

ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక రోజు ఇందు కనిపించకుండా పోతుంది. తరువాత కథ కొన్ని ఏళ్ల భవిష్యత్తులోకి మారుతుంది. పెద్దవాడైన బాలన్ తన తల్లి కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా తిరిగి గుర్తుకొస్తాయి. కానీ అవి అతనికి సమాధానాలు ఇవ్వడం కంటే కొత్త సందేహాలనే తెస్తాయి. అసలు అతని తల్లి ఎవరి నుంచి పారిపోతోంది? ఆమె గతంలో ఏమి జరిగింది? బాలన్ బాల్యంలో జరిగిన సంఘటనల వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

తెలుగులోనే అందుబాటులో

ప్రస్తుతం ‘బాలన్ ది బాయ్’ ZEE5లో అవైలబుల్ గా ఉంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఫర్జానా పాలతీంగల్ తన నటనతో ఆకట్టుకోగా, బాలన్ పాత్రలో నటించిన అబ్బాయి ఎమోషనల్ యాంగిల్ లో ఆకట్టుకుంటాడు. అలాగే స్టార్ హీరో టోవినో థామస్ ప్రత్యేక పాత్రలో కనిపించడం మరో ఆకర్షణ. సాధారణ థ్రిల్లర్లు కాకుండా, వెరైటీ థ్రిల్లర్స్ కోసం ఓటీటీలో వెతుకుతుంటే ఈ మూవీ మీ కోసమే. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్‌లో పక్కాగా డిఫరెంట్ అనుభూతి ఇచ్చే వర్త్ వాచింగ్ మలయాళం మూవీ ఇది, మస్ట్ వాచ్.

Read Also: చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×