E-Paper
Advertisement

6మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్లడీ బ్లడ్ బాత్.. పగ, ప్రతీకారాలతో అదిరిపోయే రివేంజ్ డ్రామా

6మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్లడీ బ్లడ్ బాత్.. పగ, ప్రతీకారాలతో అదిరిపోయే రివేంజ్ డ్రామా
Advertisement

Youth College Drama: చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు… కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత ఒకే కల కోసం పోటీ పడాల్సి వస్తుంది. కలిసి నవ్వుకున్న వాళ్లే ఒకరిని మించి మరొకరు నిలవాలని ప్రయత్నిస్తే స్నేహం ఏమవుతుంది ? డాన్స్‌పై ఉన్న ప్యాషన్, నేషనల్ ఛాంపియన్‌షిప్ గెలవాలనే పట్టుదల, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి… ఇవన్నీ కలిసినప్పుడు ఇద్దరి మధ్య మొదలైన చిన్న పోటీ పెద్ద గొడవగా మారుతుంది. చివరికి తమ స్నేహం కంటే విజయం ముఖ్యమా అనే ప్రశ్నకు సమాధానమే ‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’ (Best of the Best 2026) మూవీ. మరి ఈ యూత్ ఫుల్ హిందీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మాయా, అంజలి మంచి స్నేహితులు. స్కూల్ చదువు పూర్తయ్యాక ఇద్దరూ లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక యూసీఎల్‌ఏ (UCLA) యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వెళ్తారు. కొత్త కాలేజీ, కొత్త వాతావరణం, కొత్త అవకాశాలు… ఈ దశలోనూ వాళ్ల స్నేహం అలాగే కొనసాగుతుందని అనుకుంటారు. అయితే చదువుతో పాటు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మరో విషయం ఉంది. అది డాన్స్. కాలేజీలో ఎంతో క్రేజ్ ఉన్న కొలీజియేట్ బాలీవుడ్-ఫ్యూజన్ డాన్స్ టీమ్‌లో చేరడంతో వాళ్లకు తమ టాలెంట్ చూపించే అవకాశం దొరుకుతుంది. టీమ్ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఒక్కటే. అమెరికా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించడం.

Advertisement

అక్కడి నుంచే మాయా, అంజలి మధ్య పోటీ మొదలవుతుంది. ఇద్దరిలోనూ టాలెంట్ ఉండటంతో టీమ్‌లో కీలకమైన లీడ్ రోల్ ఎవరికివ్వాలనే విషయం కష్టంగా మారుతుంది. టీమ్ కెప్టెన్ రోనక్ టై-బ్రేకింగ్ ఓటు నిర్వహించి అంజలిని ఎంపిక చేయడంతో మాయాకు నిరాశ ఎదురవుతుంది. ఇది కేవలం ఒక రోల్ దక్కకపోవడంతో వచ్చిన బాధగా ఆగిపోదు. నేషనల్ ఛాంపియన్‌షిప్ గెలవాలనే ఒత్తిడి, టీమ్‌ లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, ఒకరిని మించి మరొకరు ఎదగాలనే తపన… క్రమంగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. చిన్న చిన్న మనస్పర్థలు చివరకు పెద్ద గొడవలకు దారి తీస్తాయి.

మాయా, అంజలి మధ్య ఉన్న స్నేహం కూడా ఈ పోటీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటివరకు ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకున్న వాళ్లు.. ఇప్పుడు ఒకరి ఎదుగుదలను మరొకరు తమకు ఎదురైన సవాలుగా చూడటం మొదలుపెడతారు. డాన్స్ టీమ్‌లో గెలుపు కోసం సాగుతున్న పోటీ వ్యక్తిగత జీవితంలోకి కూడా రావడంతో పరిస్థితి మరింత గందరగోళం అవుతుంది. ఇదే సమయంలో మాయా ఎదుర్కొంటున్న మరో సమస్య కూడా కథలో కీలకంగా మారుతుంది. తల్లిదండ్రుల అంచనాలు, చదువు, కెరీర్, తనకు నచ్చిన రంగంలో ఏదైనా సాధించాలనే కోరిక… వీటి మధ్య ఆమె తన స్వంత గుర్తింపు కోసం పోరాడాల్సి వస్తుంది. అంజలికి కూడా తనదైన ఒత్తిళ్లు, ఆశలు ఉంటాయి. ఇద్దరి జీవితాల్లో ఉన్న ఈ భావోద్వేగాలను సినిమా కామెడీ, కాలేజ్ లైఫ్, డాన్స్ పోటీతో కలిపి చూపించారు మేకర్స్.

Advertisement

ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని స్థాయికి వెళ్లిన సమయంలో అంజలికి తన స్నేహం గురించి కొత్త అవగాహన వస్తుంది. ముఖ్యంగా మాయా తన కుటుంబ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తనకు నచ్చిన దారిలో నిలబడేందుకు పడిన కష్టం అంజలికి అర్థమవుతుంది. అక్కడి నుంచి కథలో ఎమోషన్ మొదలవుతుంది. నేషనల్ ఛాంపియన్‌షిప్ కోసం స్టేజ్ సిద్ధమవుతున్న వేళ… విజయం కంటే తమ మధ్య ఉన్న బంధం ఎంత ముఖ్యమో ఇద్దరూ అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? స్టేజ్‌పై తమ ప్రతిభను ఎలా చూపిస్తారు ? తమ స్నేహానికి ఎదురైన అతిపెద్ద పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది సినిమాలో చూడాల్సిందే.

తెలుగులో ఎలా చూడొచ్చు ?

‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’లో మైత్రేయి రామకృష్ణన్ (Maitreyi Ramakrishnan), ప్రియాంక కేడియా (Priyanka Kedia), అంకూర్ రాతీ (Ankur Rathee) ప్రధాన పాత్రల్లో నటించారు. లీనా ఖాన్ (Leena Khan) దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో సెప్టెంబర్ 18న విడుదలైన ఈ యూత్‌ఫుల్ కాలేజ్ కామిక్ డ్రామాలో యూత్ కి కనెక్ట్ అయ్యే అన్నీ అంశాలను చూపించారు. ఓటీటీలో తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, ఇంగ్షీషు భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

Tags

Related News

హాకిన్స్ సిటీలో మళ్లీ మొదలైన వింత రాక్షసుల విలయం.. యానిమేషన్ ప్రపంచంలో స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్

మురికివాడ నుంచి రేస్ ట్రాక్ వరకు.. స్పోర్ట్స్ అసోసియేషన్ కోరలు పీకే యంగ్ అథ్లెట్

అమ్మాయిని 6 దాటితే కలవకూడదనే వింత కండిషన్.. రూపం మార్చే ఈవిల్ మిస్టరీ

పెళ్లి నుంచి లేచిపోడానికి ప్లాన్ చేసే జంట.. అనుకోకుండా బయటపడే సీక్రెట్‌తో హంగామా!

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఏకంగా 13 స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×