BigTV English

OTT Movie : రిలీజై నెల కూడా కాకముందే ఓటీటీలో వచ్చేసిన కన్నడ బ్లడ్ ఫెస్ట్… కానీ స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్

OTT Movie : రిలీజై నెల కూడా కాకముందే ఓటీటీలో వచ్చేసిన కన్నడ బ్లడ్ ఫెస్ట్… కానీ స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్

OTT Movie : సినిమాలలో ఇటీవల కాలంలో వయొలెన్స్ అనేది ట్రెండింగ్ గా మారింది. బ్లడ్ బాత్ కు యాక్షన్ సన్నివేశాలు తోడైతే అదే ఈ కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరిపోయాయి. ఇక ఓ కన్నడ డైరెక్టర్ కూడా ఇదే జానర్లో హింసాత్మక సన్నివేశాలతో హిట్ అందుకోవడానికి ప్రయత్నించాడు. ఈ మూవీనే థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. కాకపోతే స్ట్రీమింగ్ విషయంలో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.


మూవీ స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘వామన’ (Vaamana). 2025లో విడుదలైన ఈ కన్నడ యాక్షన్ డ్రామాకు డెబ్యూ డైరెక్టర్ శంకర్ రామన్ ఎస్ దర్శకత్వం వహించారు. చేతన్ కుమార్ గౌడ నిర్మించారు. ఈ చిత్రంలో ధన్వీర్రాహ్ గౌడ (గుణ పాత్రలో), రీష్మా నానయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే సంపత్ రాజ్, ఆదిత్య మీనన్, అచ్యుత్ కుమార్, శివరాజ్ కేఆర్ పీట్ ఇతరులు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. మే 5 నుండి ‘వామన’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ మూవీ ఇండియా ఓటీటీలలో ఇంకా స్ట్రీమింగ్ కు అందుబాటులో లేదు. మరి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే యూకే అండ్ యూఎస్ లో మాత్రమే. త్వరలోనే ఈ మూవీ ఇండియాలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

కథలోకి వెళ్తే…
గుణ (ధన్వీర్రాహ్ గౌడ) ఒక సామాన్య యువకుడే ఇందులో హీరో. గతంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన వల్ల అతని జీవితం తలక్రిందులవుతుంది. తన తల్లికి సంబంధించి చేసే పోరాటం అతన్ని ఒక రూత్‌లెస్ యాక్షన్ హీరోగా మారుస్తుంది. సినిమా టైటిల్ “వామన”… అంటే హిందూ పురాణాలలోని వామన అవతారం అన్నమాట. గుణ సామాన్య వ్యక్తి అయినప్పటికీ వామనుడిలా ఎదిగి, శత్రువులను అంతం చేస్తాడు అనే విధంగా మూవీకి ఆ టైటిల్ పెట్టినట్టు ఉన్నారు.


గుణ తన గతంలో జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పవర్ ఫుల్ విలన్ సిండికేట్‌తో ఫైట్ చేస్తాడు. ఈ సిండికేట్‌లో ఒక రాజకీయ నాయకుడు, క్రిమినల్ లీడర్ ఉంటాడు. ఈ కథలో గుణ ప్రేమకథ (రీష్మా నానయ్యతో) వంటి రొమాంటిక్ ఎలిమెంట్‌ కూడా ఉంటుంది. కానీ మెయిన్ ఫోకస్ అంతా ప్రతీకారం, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌పైనే ఉంటుంది. సినిమాలో బ్లడ్ బాత్ గట్టిగానే ఉంటుంది. ఇక చివరి 30 నిమిషాలు హైలెట్ గా ఉంటుంది. అసలు పొలిటికల్ లీడర్ తో హీరోకి ఉన్న సమస్య ఏంటి? హీరో గతం ఏంటి, అతని తల్లికి ఏమైంది? చివరికి పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ.

Related News

OTT Movie : 2 గంటల 11 నిమిషాల మలయాళం మూవీ… IMDbలో 9.4 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

OTT Movie : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే

OTT Movie : రాత్రికి రాత్రే యవ్వనంగా మారిపోయే భార్య… ఒక్క సిప్ తో అమరత్వం ఇచ్చే అమృతం… భర్తకు దబిడి దిబిడే

Malayalam Movies on OTT : క్రైమ్ నుంచి కామెడీ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మలయాళం సినిమాలు ఇవే

OTT Movie : ఓటీటీలోకి 5340 కోట్ల మూవీ… ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉన్న అల్టిమేట్ యాక్షన్ అడ్వెంచర్

OTT Movie : ఓరి నాయనో… ఈ ఫ్యామిలీ మొత్తం తేడానే… ఏమైనా చేస్కోమంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చే చెల్లి

Big Stories

×