BigTV English

OTT Movie: వరుస హత్యలతో నగరాన్ని పరుగులు పెట్టించిన సైకో కిల్లర్.. మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్..

OTT Movie: వరుస హత్యలతో నగరాన్ని పరుగులు పెట్టించిన సైకో కిల్లర్.. మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్..

OTT Movie: ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ఓటీటీ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాల మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న స్టోరీ తో వచ్చిన సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లో సునామీ సృష్టిస్తున్నాయి. అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా మంచి వ్యూస్ ని రాబడుతూ సరికొత్త రికార్డుని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో బేసిల్ జోసఫ్ నటిస్తున్న సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో అతడు సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బేసిల్ నటించిన ఓ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ సినిమా పేరేంటి? ఏ ఫ్లాట్ ఫామ్ లో స్విమ్మింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళ ప్రముఖ నటుడు బేసిల్ జోసెఫ్ సినిమాలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది. హారర్, థ్రిల్లర్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి.. బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించిన ఈ మరణమాస్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్ల లో రిలీజైంది. శివప్రసాద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ప్రముఖ మలయాళ హీరో టొవినో థామస్ ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహారించారు.. బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీకి తొలి రోజు నుంచే మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 10న థియేటర్ల లో రిలీజైంది. ఇప్పుడీ సినిమాను మే 15 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ఓటీటీ సోమవారం  వెల్లడించింది..


స్టోరీ విషయానికొస్తే.. 

మలయాళం నటుడు బేసిల్ జోసఫ్ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి కథతో సినిమా వచ్చిన సరే ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఓ నగరాన్ని వరుస హత్యలతో వణికిస్తుంటాడు. అయితే ఓ రాత్రి ఆ సైకో కిల్లర్, అతడు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి, ఓ ప్రేమ జంట, పలువురు ఇతరులు ఓ బస్సులో చిక్కుకుంటారు. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు, ఊహించని ఓ క్లైమ్యాక్స్ ఆకట్టుకుంటుంది. నగరాన్ని వణికించే సైకో కిల్లర్ చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా మొత్తం కాస్త కామెడీ ఉన్నా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. మొత్తానికి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. బేసిల్ జోసెఫ్ సినిమాలు ఈమధ్య వరుసగా హిట్ టాక్ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈ మూవీ కూడా అలాంటి టాక్ ని అందుకునేలా కనిపిస్తుంది.

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×