E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Director KK:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ కేకే అలియాస్ కిరణ్ కుమార్ (Kiran Kumar) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. 2010లో నాగార్జున (Nagarjuna ) హీరోగా నటించిన ‘ కేడీ’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాదు సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్, మణిరత్నం ఓకే బంగారం , చెలియా , నవాబ్ వంటి చిత్రాలకు డైలాగ్స్ కూడా అందించారు అంతేకాదు మణిరత్నం చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కేకే.. 2017లో అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలాంటి ఈయన గత ఏడాది అనారోగ్యంతో డిసెంబర్లో మరణించారు. మరణానికి ముందే ఆయన దర్శకత్వం వహించిన ‘కే జే.క్యూ’ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఓటీటీలోకి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి చిత్రం..

డైరెక్టర్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన చిత్రం కింగ్ జాకీ క్వీన్ (KJQ). ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది.. మొత్తానికైతే డైరెక్టర్ కిరణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా ఓటీటీలోకి రావడంతో అభిమానులు కూడా ఈ సినిమా పట్ల ఆదరణ కనబరుస్తున్నారు.

Advertisement

ALSO READ:ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

కింగ్ జాకీ క్వీన్ మూవీ స్టోరీ..

ఇకపోతే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హైదరాబాదు ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది అనాధలైన పార్థ ( దీక్షిత్ శెట్టి), జాకీ ( శశి ఓదెల).. ఇద్దరు ప్రాణ స్నేహితులుగా పెరుగుతారు. ఒక పెద్ద డాన్ (మురళీధర్ గౌడ్) సమక్షంలో వీరు నగరంలోనే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ గా ఎదుగుతారు. అయితే వీరిద్దరి మధ్యలోకి భార్గవి (యుక్తి తరేజా) వస్తుంది. దీంతో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అధికారం, ప్రేమ, గర్వం కలగలిసిన ఈ సంఘర్షణలో ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? చివరికి వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? ముఖ్యంగా ఇద్దరిలో ఎవరు భార్గవిని వివాహం చేసుకున్నారు? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తానికైతే థియేటర్లలో సినిమా చూడడం మిస్సయిన మాస్ , యాక్షన్ ప్రియులు.. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వీక్షకులు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

కేకే బ్యాక్ గ్రౌండ్:

Advertisement

కిరణ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. అనంతపురం కి చెందిన వ్యక్తి. సినిమాల్లోకి రాకముందు బీటెక్ పూర్తి చేశారు. దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి ముందు దర్శకుడు రాఘవేందర్రావు, కే ప్రకాష్, ఎన్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇక మొదటిసారి బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు.

Related News

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×