E-Paper
Advertisement

ఓటీటీలోకి జయసుధ సమ్మర్ హాలిడేస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి జయసుధ సమ్మర్ హాలిడేస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Summer Holidays Movie:తెరపై సందడి చేసిన ఎన్నో చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనసును హత్తుకున్న ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం కూడా ఒకటి . ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రముఖ సీనియర్ నటిగా, సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ ఇందులో అమ్మమ్మ పాత్రలో మరోసారి ఒదిగిపోయి కనిపించారు.. ఇక అలా తెరపై నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న సమ్మర్ హాలిడేస్..

జయసుధ ప్రధాన పాత్రలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషిస్తూ రోహన్ రాయ్, అరుణ్ దేవ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సమ్మర్ హాలిడేస్. శ్రీకర్ నాయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మించారు.నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించింది. బాల్యం, స్నేహం, వాటి జ్ఞాపకాల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటు 90 స్ కిడ్స్ తో పాటు ఈతరం యువతను కూడా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్.

నెలలోపే ఓటీటీలోకి..

Advertisement

తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ వేదికగా డిసెంబర్ 4వ తేదీ నుండి ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.. మొత్తానికైతే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు సోనీ వేదికగా డిజిటల్ అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఇందులో వాసుకి , హర్షిని, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించారు.

also read:చిన్మయితో రాహుల్ మూవీ.. టైటిల్ చెప్పేసిన అడివి శేష్!

సమ్మర్ హాలిడేస్ సినిమా స్టోరీ:

Advertisement

సినిమా కథ విషయానికి వస్తే పట్టణంలో ఉండే రావూరి వెంకటేష్ అలియాస్ ఆర్ వి (అరుణ్ దేవ్) తండ్రి (హర్ష) చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . మార్క్స్, ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోమని కొడుకుని బలవంతం పెడుతూ ఉంటాడు. రాకపోతే తిడతాడు కూడా .. అయితే సమ్మర్ హాలిడేస్ ముందు ఫస్ట్ ర్యాంకు రాకపోవడం తండ్రి బాగా తిట్టడంతో భయపడిన ఆర్.వీ ని కూల్ చేయడానికి తల్లి (వాసుకి ) మొదటిసారి సమ్మర్ హాలిడేస్ కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ ఆర్.వీ కి కాశీ వెంకటేశ్వర్లు అలియాస్ కె.వి (రోహన్) పరిచయం అవుతాడు. కె.వికి చాలా కష్టాలు ఉన్నా.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్కూల్ కి వెళ్తూ సరదాగా ఉంటాడు. తల్లికి సొంత డబ్బులతో ఒక చీర అయినా కొనివ్వాలి అనుకుంటాడు. దాంతో వర్మ (రాజీవ్ కనకాల) దగ్గర కొన్ని మామిడి చెట్లు అద్దెకు తీసుకొని సాగు చేస్తూ ఉంటాడు కేవీ. మరి కె.వి లైఫ్ లోకి ఆర్ వి ఎలా వచ్చాడు ?ఈ ఇద్దరు కలిసి ఎలా ఎంజాయ్ చేశారు? ఎవరి వల్ల ఎవరి లైఫ్ మారిపోయింది ? ఎవరి కష్టాలు ఎలా సాగాయి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే .

Related News

చేతిలో లవ్ లెటర్ బదులు డ్రగ్స్ ప్యాకెట్.. ప్రపోజల్ ప్లాన్ రివర్స్… ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న మూవీ

మనుషులను మొక్కలుగా మార్చే వింత టెక్నాలజీ… ఆ తర్వాత వరుస హత్యలు… మతిపోగొట్టే సైఫై థ్రిల్లర్

ఆ కుర్రాడిని తాకితే చాలు బాధలన్నీ మాయం… ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్

ఒకప్పుడు ప్రాణ స్నేహితులు… కట్ చేస్తే కరుడుగట్టిన శత్రువులుగా… దుమ్మురేపే యాక్షన్ వార్ డ్రామా

8 మంది ఫ్రెండ్స్, 12 క్రేజీ గేమ్స్… నేటి నుంచే ఓటీటీలో ఫన్ రియాలిటీ షో

మృత్యువు వెంటాడుతున్న నగరం… చావు లేని ఆ ఒక్కడి కోసం వేట… తెలుగులో అదిరిపోయే థ్రిల్లర్

నేటి నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆధ్యాత్మిక వండర్ హనుమాన్ అంశ్’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడాలంటే?

Big Stories

Advertisement
×