E-Paper
Advertisement

మనుషులను మొక్కలుగా మార్చే వింత టెక్నాలజీ… ఆ తర్వాత వరుస హత్యలు… మతిపోగొట్టే సైఫై థ్రిల్లర్

మనుషులను మొక్కలుగా మార్చే వింత టెక్నాలజీ… ఆ తర్వాత వరుస హత్యలు… మతిపోగొట్టే సైఫై థ్రిల్లర్
Advertisement

Fool Night Series on OTT: భూమిపై వందేళ్ల పాటు సూర్యుడే కనిపించకుండా దట్టమైన నల్లటి మేఘాలు కమ్మేసి, ఆక్సిజన్ దొరక్క మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదూ.. ఇక మనుషులు బతకాలంటే చివరికి మనుషులనే మొక్కలుగా మార్చాల్సిన పరిస్థితి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది కదా. ఈ భయంకరమైన భవిష్యత్ ప్రపంచం నేపథ్యంలో రూపొందిన సైఫై సైకలాజికల్ థ్రిల్లర్ యానిమే సిరీస్ ‘ఫూల్ నైట్’ (Fool Night) ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. కసుమి యసుదా రాసిన మాంగా ఆధారంగా, దిగ్గజ యానిమేషన్ స్టూడియోలు ‘సన్‌రైజ్’, ‘షాఫ్ట్’ కలిసి నిర్మించిన ఈ సిరీస్‌కు అట్సుషి యుకావా దర్శకత్వం వహించారు. కోకి ఉచియామా, మినాకో కొటోబుకి, జున్యా ఎనోకి మెయిన్ రోల్స్‌కు వాయిస్ ఇచ్చారు. పేదరికం తట్టుకోలేక తన శరీరాన్నే మొక్కగా మార్చుకోవడానికి సిద్ధమైన ఒక యువకుడికి ఎదురైన భయంకరమైన హత్య రహస్యాలను ఈ సిరీస్ కళ్లకు కట్టింది.

మనుషులే మొక్కలుగా మారితే.. ఆ మొక్కలు హత్యలు చేస్తే?

ఇక్కడ భవిష్యత్తులో భూమిపై దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో సూర్యకాంతి పూర్తిగా తగ్గిపోతుంది. మొక్కలు ఎండిపోవడంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు శాస్త్రవేత్తలు ‘ట్రాన్స్‌ఫ్లోరేషన్’ అనే టెక్నాలజీని కనిపెడతారు. దీని ద్వారా చావుకు దగ్గరైన మనుషుల శరీరాల్లో విత్తనాలు నాటి, వారిని ఆక్సిజన్ అందించే మొక్కలుగా మారుస్తారు. ఇలా మొక్కలుగా మారిన వారిని ‘స్పిరిఫ్లోరా’ అని పిలుస్తారు. ఈ ప్రక్రియకు అంగీకరించిన వారికి భారీ మొత్తంలో డబ్బు కూడా అందుతుంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో పేదరికంతో పాటు అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మందులు కొనలేక ఇబ్బందిపడుతున్న తోషిరో కమియా అనే యువకుడు.. తన శరీరాన్ని మొక్కగా మార్చుకునేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం 10 మిలియన్ యెన్లు తీసుకుని ట్రాన్స్‌ఫ్లోరేషన్ ప్రక్రియకు అంగీకరిస్తాడు. అయితే ఆ ఆపరేషన్ తర్వాత అతడికి ఓ వింత శక్తి వస్తుంది. ఇప్పటికే మొక్కలుగా మారిపోయిన మనుషుల గొంతులను, వారి ఆలోచనలను వినగలుగుతాడు.

ఈ ప్రత్యేక శక్తిని గుర్తించిన ట్రాన్స్‌ఫ్లోరా మెడికల్ సంస్థ అతడిని తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకుంటుంది. ఈ క్రమంలో ఒక మొక్క నుంచి వినిపించిన దారుణ హత్య రహస్యం కమియాను, అతని చిన్ననాటి స్నేహితురాలు యోమికోను ఒక భయంకరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోకి లాగుతుంది. చివరికి ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు ? ప్రాణాలతో ఉన్నవారిని కాపాడాల్సిన టెక్నాలజీనే మరిన్ని ప్రాణాలను బలితీసుకుంటోందా? అన్న ఉత్కంఠతో కథ ముందుకు సాగుతుంది. డార్క్ సైఫై, డిస్టోపియన్ కథలు, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్ళు ఈ సిరీస్ ను బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. అంతే కాదు పిల్లలతో ఈ యానిమే చూస్తే వచ్చే కిక్కే వేరు.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

‘ఫూల్ నైట్’ (Fool Night) యానిమే సిరీస్‌కు అట్సుషి యుకావా దర్శకత్వం వహించగా, జిన్ తనకా సిరీస్ కంపోజిషన్ బాధ్యతలు చేపట్టారు. కసుమి యసుదా రాసిన మాంగా ఆధారంగా రూపొందిన ఈ యానిమేలో తోషిరో కమియాగా కోకి ఉచియామా, యోమికో హొరాయ్‌గా మినాకో కొటోబుకి, అకిరా యత్సుకాగా జున్యా ఎనోకి వాయిస్ అందించారు. ఈ యానిమే సిరీస్ 2026 నవంబర్ 26 నుంచి Netflixలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో మొత్తం 12 ఎపిసోడ్లు ఒకేసారి విడుదలయ్యాయి. ఇది జపనీస్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు ఆడియోలలో కూడా అందుబాటులో ఉంది.

Read Also: 20 ఏళ్లుగా తొక్కిపెట్టిన అమ్మాయి మిస్సింగ్ కేసు.. కోర్టులో బయటపడ్డ భయంకర నిజాలు… థ్రిల్లింగ్ సిరీస్

Tags

Related News

ఆ కుర్రాడిని తాకితే చాలు బాధలన్నీ మాయం… ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్

ఒకప్పుడు ప్రాణ స్నేహితులు… కట్ చేస్తే కరుడుగట్టిన శత్రువులుగా… దుమ్మురేపే యాక్షన్ వార్ డ్రామా

8 మంది ఫ్రెండ్స్, 12 క్రేజీ గేమ్స్… నేటి నుంచే ఓటీటీలో ఫన్ రియాలిటీ షో

మృత్యువు వెంటాడుతున్న నగరం… చావు లేని ఆ ఒక్కడి కోసం వేట… తెలుగులో అదిరిపోయే థ్రిల్లర్

నేటి నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆధ్యాత్మిక వండర్ హనుమాన్ అంశ్’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడాలంటే?

20 ఏళ్లుగా తొక్కిపెట్టిన అమ్మాయి మిస్సింగ్ కేసు.. కోర్టులో బయటపడ్డ భయంకర నిజాలు… థ్రిల్లింగ్ సిరీస్

డేటింగ్ యాప్ ఆఫీసులో సీక్రెట్ లవ్… ఓటీటీలోకి వచ్చిన క్రేజీ రొమాంటిక్ సిరీస్

Big Stories

Advertisement
×