E-Paper
Advertisement

ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Chiranjeevi:చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణాలు అభిమానులను తీవ్ర అఘాతంలోకి నెట్టి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ప్రముఖ సీనియర్ నటీమణి షావుకారు జానకి(Sowcar Janaki) కన్నుమూయగా.. రెండు రోజుల క్రితం ప్రముఖ సీనియర్ నటుడు జీ.వీ.నారాయణరావు(GV narayana rao) మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆగస్టు 27న ముగియగా.. ఈయన అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జీ.వీ. నారాయణ  రావుతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

జీ.వీ.నారాయణ రావుతో చిరంజీవికి ఆత్మీయ అనుబంధం..

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ సినీ నటుడు జీవీ నారాయణరావు.. అనారోగ్య సమస్యలతో ఇటీవల తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. తను అప్పటికే ఇన్స్టిట్యూట్లో సీనియర్.. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు.. తను వచ్చి తన అనుభవాలను మాతో పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లం ఎదిగినప్పుడు నాకు ఒక స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు..” నేను నిర్మాతగా నిలబడాలనుకుంటున్నాను .నువ్వు సినిమాలు చేయాలని” నన్ను అడిగారు. అలా ఆయన నిర్మాణంలో నేను రెండు చిత్రాలు చేశాను . నా సినిమాల్లో తనకు నటుడిగా కూడా అవకాశం వచ్చేలా చేశాను. అలా మా అనుబంధం కొనసాగుతూ వచ్చింది.

Advertisement

also read:రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి శిరీష.. వరుడు ఎవరంటే?

అదే ఆఖరి మాట అవుతుందనుకోలేదు – చిరంజీవి

అయితే యాదృచ్ఛికంగా ఒక పది రోజుల క్రితం.. “నేను ఒక సినిమా చేశాను. మంచు పల్లకి ఇన్స్పిరేషన్ తో ఐదుగురు కుర్రవాళ్ళు.. పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారో అనే కథతో ఒక సినిమా చేశాను. ట్రైలర్ లాంఛ్ చేయాలి. మీ సహకారం ఉంటే అందరికీ బాగుంటుంది “అని ఆయన అడిగారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. పైగా ఆ క్షణంలో ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగుదాం రమ్మని అడిగారు. బహుశా తన ఆఖరి చిత్రం అదేనేమో.. ఆ సమయంలో మేము చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పాను. పైగా ఆల్ ద బెస్ట్ కూడా ఆయనకు చెప్పాను. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు. ఎక్కడున్నా సరే నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులు కూడా నా కుటుంబ సభ్యులే .. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ జీవి నారాయణరావుతో ఉన్న తనకు వున్న అనుబంధాన్ని చిరంజీవి పంచుకున్నారు.

జీ.వీ.నారాయణ రావు సినీ ప్రస్థానం..

Advertisement

దర్శకుడు కే బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రంతో 1976లో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు . సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది . పైగా చిరంజీవి హీరోగా నటించిన దేవాంతకుడు, యముడికి మొగుడు వంటి చిత్రాలకు జీవీ నారాయణరావు నిర్మాతగా వ్యవహరించారు.

Related News

మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!

నైజాంలో ‘ఇరుముడి ‘ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?

టాక్సిక్ డైరెక్టర్ ముందు తీసిన సినిమాలు ఇవే.. ఒక్కోటి డిఫరెంట్!

సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్!

వ్రతాల పేరుతో ఈ దరిద్రపు రచ్చ ఏందిరా బాబు.. సునైనా ఘాటు వ్యాఖ్యలు!

ఇరుముడి తర్వాత రవితేజ చేయబోయే సినిమాలివేనా ?

విష్ణుప్రియ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక అసలు కష్టం ఇదే!

Big Stories

Advertisement
×