OTT Movie : హారర్ సినిమాలు చాలా రకాలుగా భయపెడతాయి. భయపడుతూ ఎంటర్టైన్ చేసే సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే, అవి హారర్ సినిమాలు మాత్రమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, బొమ్మ రూపంలో ఉండే దెయ్యం విచిత్రంగా చంపుతుంది. దానిని చూస్తున్నంత సేపు అది ఏమీ చేయదు. చూపు తిప్పుకుంటే ఇక వాళ్ళ పని ఐపోయినట్లే. ఈ మూవీని మీరు చూడకపోయినట్లైతే, తప్పకుండా చూడండి. ఇది ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీ లో ఉందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డోంట్ లుక్ అవే’ (Don’t Look Away). 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీకి మైఖేల్ బఫారో దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫ్రాంకీ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఒక మానికిన్ బొమ్మ రూపంలో ఉండే డెవిల్, తనని చూసిన వాళ్ళని వెంటాడుతూ చంపుతుంది. దాని బారిన ఫ్రాంకీ కూడా పడుతుంది. అప్పటినుంచి స్టోరీ ఒక మలుపు తీసుకుంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక ట్రక్కును కొంతమంది దొంగలు దోచుకునేందుకు ప్రయత్నిస్తారు. ట్రక్కులో ఒక పెట్టె ఉంటుంది, దాన్నిఆ దొంగలు తెరిచినప్పుడు ఒక మానికిన్ బొమ్మ బయటపడుతుంది. ఈ మానికిన్ దొంగలను దారుణంగా చంపేస్తుంది. ట్రక్ డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో, ఫ్రాంకీ అనే యువతి కారుకు ఢీకొని మరణిస్తాడు. ఫ్రాంకీ ఈ ఘటనలో మానికిన్‌ను చూస్తుంది. ఆ క్షణం నుండి ఆమె జీవితం తలకిందులవుతుంది. మానికిన్ ఫ్రాంకీని వెంటాడటం ప్రారంభిస్తుంది. ఆమె వెళ్ళిన ప్రతిచోటా కనిపిస్తూ, ఆమె స్నేహితులను కూడా హత్య చేస్తుంది. ఈ మానికిన్ ఒక ప్రత్యేక నియమాన్ని అనుసరిస్తుంది. దానిని చూస్తూ ఉంటే అది కదలదు, కానీ చూపును తప్పిస్తే అది తప్పించుకుని చంపుతుంది. ఫ్రాంకీ, ఆమె స్నేహితులు ఈ రహస్యాన్ని తెలుసుకుంటారు. దాన్ని ఆపే మార్గం కోసం వెతుకుతారు.
ఈ క్రమంలో విక్టర్ మాలిక్ అనే వృద్ధుడు, వారికి సహాయం చేయడానికి వస్తాడు. అతను గతంలో ఈ మానికిన్ తో పోరాడి ఉంటాడు. దాని గురించి ఇతనికి బాగా తెలిసి ఉంటుంది. చివరికి ఫ్రాంకీ, ఆమె ప్రియుడు జోనాహ్ మానికిన్‌ను ఒక పెట్టెలో బంధింస్తారు. దాన్ని దూరంగా పంపే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ పెట్టెను తీసుకెళ్ళేటప్పుడు పగిలిపోతుంది. మానికిన్ మళ్లీ బయటకు వస్తుంది. అది హత్యలు చేయడం మళ్లీ ప్రారంభిస్తుంది. చివరికి మానికిన్ ను ఫ్రాంకీ అదుపు చేయగళదా? మానికిన్ వలన ఫ్రాంకీ కి కష్టాలు తప్పవా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే. ఈ సినిమాను ఒంటరిగా చూడకండి. ఎవరినైనా తోడు తెచ్చుకుని చూడండి. ఎందుకంటే ఈ మూవీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది.