Sobhitha Dulipala: శోభిత దూళిపాళ్ల పేరు ఒకప్పుడు తెలుగు వాళ్లకు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని వారి కోడలుగా శోభిత అందరికీ పరిచయమే. ఈమె గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న శోభిత తన గురించి లేటెస్ట్ విషయాలను అందరితో షేర్ చేసుకుంటుంది. ఈమె తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా కూడా, బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పెళ్లయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తుందా అనే వార్తలు కూడా ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె సినిమాలు గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇవి కచ్చితంగా ఆమె ఫ్యాన్స్ కి అక్కినేని ఫ్యామిలీకి పెద్ద షాకే అని అర్థమవుతుంది. మరి శోభిత ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read : ‘మాతో పెట్టుకోవద్దు జాగ్రత్త’.. మోదీకి హీరో స్ట్రాంగ్ వార్నింగ్..?
బాలీవుడ్ లో బిజీ అవ్వబోతున్న శోభిత..
ఈమె నిజానికి తెలుగు హీరోయిన్ నే అయితే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో ముంబైకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ముంబై వెళ్లి మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో సందడి చేసిందని చెప్పాలి.. ఇకపోతే పలు సినిమాల్లో నటించి అట్రాక్ట్ చేసిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. 2018లో వచ్చి అందరినీ ఆకట్టుకున్న గూఢచారి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఇటీవలే నాగచైతన్య అని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్లో పెడుతుందని తెలుస్తుంది. శోభిత కూడా పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది..
శోభిత షాక్ ఇవ్వబోతుందా..?
శోభిత సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది. ఫ్యాషన్ లో ఆమె ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు క్రేజీ అండ్ మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో ఆమె చేసే సందడి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ గా రెడీ అవుతూ ఆకట్టుకుంటూ ఉంటోంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా హెయిర్ మొత్తాన్ని కత్తిరించాలా? అంటూ ఒక పోల్ పెట్టి ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. చాలా మంది పూర్తిగా హెయిర్ షేవ్ చేసుకుంటుందేమోనని అనుమానపడ్డారు. బోల్డ్ సమ్మర్ మేకోవర్ అని కామెంట్స్ చేశారు. మొత్తానికి ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా తన హెయిర్ ను ట్రిమ్ చేసినా, కట్ చేసినా సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..