Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈరోజు సినిమాలు తెలుగులో కూడా హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. చాలామంది హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు హీరోయిన్లు రాజకీయాల్లో తమ సత్తాను చాటుతూ దూసుకుపోతున్నారు. ఇక విజయ్ దళపతి ఇటీవలే కొత్త పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగమ్ పా ర్టీ తొలి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు సంచలనం గా మారాయి.. ముఖ్యంగా మోడీ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవారిలో ఉన్నాయి.
మోదీని టార్గెట్ చేసిన హీరో..
విజయ్ స్థాపించిన కొత్త పార్టీలో ఒక సమావేశన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ మాట్లాడుతూ డైరెక్ట్ గా మోదిని టార్గెట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. DMK, బీజేపీ పార్టీలు రహస్య మిత్రులని, పేరుకి మాత్రమే కాంగ్రెస్ కూటమిలో కూటమిలో ఉందని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ అంశం పై, అదే విధంగా త్రిభాషా విధానం తో హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చేసే ప్రయత్నం పై విజయ్ మోడీపై విమర్శలు గుప్పించారు. జిఎస్టి, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై, జమిలీ ఎన్నికల ప్రక్రియ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. విజయ్ మాట్లాడుతూ ఇలాంటివన్నీ అన్యాయం చేయాలని చూస్తున్నారు.. తప్పకుండా ఏదో ఒక రోజు నిజ స్వరూపం బయట పడుతుంది అంటూ విజయ్ అన్నారు. తమిళనాడు జోలికొస్తే మర్యాదగా ఉండదు అంటూ మోడీకి విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డీఏంకే vs టీవికె పార్టీల మధ్య పోటీ..
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకీ వేడి ఎక్కుతున్నాయి. కొత్త పార్టీలు పాత పార్టీల మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ పాట పాడుతుంటే , DMK ఆ పాటకు డ్యాన్స్ వేస్తుంది అంటూ ఆయన విరుచుకుపడ్డారు.. ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతగా విమర్శలు చేస్తున్న కూడా అటుపక్క నుంచి ఎటువంటి సమాధానం లేకుండా సైలెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. విజయ్ దళపతి రా జకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు. చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తుంది. విజయ్ వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు అని తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అసలే కొత్త పార్టీ రాజకీయాల్లో అంత అనుభవం కూడా లేదు. ఇప్పుడు విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తన చివరి సినిమా చేస్తున్నారు.. ఆ సినిమాను పూర్తి చేసి రాజకీయాల్లో పూర్తిగా బిజీ అవ్వాలని విజయ్ భావిస్తున్నారు..