OTT Movie : పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘బాడీగార్డ్’ వెబ్ సిరీస్, ఎక్కువ రేటింగ్ తో జనాదరణ పొందింది. ఈ కథ లండన్‌లో టెర్రర్ అటాక్స్, పొలిటికల్ గేమ్స్ తో అదరగొడుతుంది. ఒక పొలిటీషియన్‌ను కాపాడే బాడీగార్డ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆడియన్స్ కోరుకునే అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా పొలిటీషియన్ తో, బాడీగార్డ్ నడిపే లవ్ ట్రాక్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇది 2019 గోల్డెన్ గ్లోబ్‌లో బెస్ట్ సిరీస్ అవార్డును కూడా పొందింది. బాడీగార్డ్ పాత్రలో నటించిన రిచర్డ్ మాడెన్ బెస్ట్ యాక్టర్ గా గెలిచారు. ఈ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘బాడీగార్డ్’ 2018లో వచ్చిన బ్రిటిష్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్. దీన్ని జెడ్ మెర్క్యూరియో రూపొందించారు. ఇందులో డేవిడ్ బుడ్ (రిచర్డ్ మాడెన్), జూలియా మొంటాగ్యూ (కీలీ హావెస్) ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 6 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ 2018 అక్టోబర్ 24న BBC One, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. ఒక్కో ఎపిసోడ్ 55 నుంచి 60 నిమిషాలు ఉంటుంది. దీనికి IMDbలో 8.0/10 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది.
డేవిడ్ లండన్‌లో ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్. అతను అఫ్గానిస్తాన్ వార్‌లో ఫైట్ చేసిన ఒక వెటరన్. ప్రస్తుతం అతను మెంటల్ స్ట్రెస్ తో బాధపడుతుంటాడు. అతను తన వైఫ్ విక్కీతో విడిపోయి, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటాడు. ఇక ఈ సిరీస్ మొదట్లో ఒక ట్రైన్‌లో బాంబ్ అటాక్ జరుగుతుంది. డేవిడ్ అక్కడ ఉండి, బాంబ్ దాడి నుంచి అందరినీ కాపాడి హీరో అవుతాడు. ఈ కారణంగా అతన్ని హోమ్ సెక్రటరీ జూలియా మొంటాగ్యూను కాపాడే జాబ్ ఇస్తారు. జూలియా పెద్ద పొలిటీషియన్, స్ట్రిక్ట్ సెక్యూరిటీ రూల్స్ పెట్టాలనుకుంటుంది. కానీ డేవిడ్ ఆమె రూల్స్‌ను లైక్ చేయడు. దుకంటే అవి మరిన్ని ప్రాబ్లమ్స్ పెంచుతాయని ఫీల్ అవుతాడు. కానీ డ్యూటీ కోసం ఆమెను ప్రొటెక్ట్ చేస్తాడు. డేవిడ్ తన మెంటల్ ప్రాబ్లమ్స్‌తో స్ట్రగుల్ చేస్తూ, జూలియాతో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
డేవిడ్, జూలియాకు బాడి గార్డ్ గా ఉన్నప్పుడు, ఆమెకు టెర్రర్ థ్రెట్స్ వస్తున్నాయని తెలుస్తుంది. డేవిడ్ ఆమెను క్లోజ్‌గా ఫాలో అవుతూ, ఆమెతో కొంచెం రొమాన్స్ ఫీల్ అవుతాడు. వాళ్ల మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో, లండన్‌లో టెర్రర్ అటాక్స్ పెరుగుతాయి. జూలియా టీమ్‌లో కొందరు నమ్మకం లేనట్టు డేవిడ్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు జూలియా, డేవిడ్‌ను మాత్రమే ట్రస్ట్ చేస్తుంది. కానీ ఆమె పొలిటికల్ డెసిషన్స్ డేవిడ్‌కు నచ్చవు. ఇంతలో జూలియాకు ఒక పెద్ద బాంబ్ అటాక్‌లో డేంజర్ వస్తుంది. ఇక్కడి నుంచి స్టోరీ పూర్తిగా మారిపోతుంది. ఊహించని ట్విస్ట్లు వస్తాయి. జూలియాకు టెర్రర్ అటాక్స్ తో ఎలాంటి సమస్యలు వస్తాయి ? డేవిడ్ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు ? వీళ్ళ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భర్త మోసానికి భార్య రివేంజ్… ఎవడితో పడితే వాడితో ఆ పని… చూసి తట్టుకోవడం కష్టమే