Tamil Courtroom Drama OTT : సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు వలలో ఏం పడుతుందో ముందుగా తెలియదు. కొన్నిసార్లు మంచి చేపలు దొరుకుతాయి. మరికొన్నిసార్లు రోజంతా కష్టపడినా ఖాళీ చేతులతోనే ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది. కానీ ఒక మత్స్యకారుడికి సముద్రంలో దొరికిన బంగారు లాకెట్ అతని జీవితాన్నే తలకిందులు చేస్తే, ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. అదృష్టంగా భావించిన వస్తువే నేరానికి సాక్ష్యంగా మారి, చివరకు ప్రభుత్వంతోనే న్యాయపోరాటం చేయాల్సి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి ? ఈ ప్రశ్నల చుట్టూ తిరిగే సోషల్ కోర్టు రూమ్ డ్రామా ‘ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ’ (Enna Vilai The Price of Dignity). మరి ఈ తమిళ సినిమాను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
సముద్రంలో నాణేలు వెతుకుతూ జీవనం సాగించే ఓ మత్స్యకారుడికి ఒకరోజు బంగారు పతకం దొరుకుతుంది. దాన్ని తన అదృష్టంగా భావించేలోపే, ఆ వస్తువు దొంగతనానికి సంబంధించినదని ఆరోపణలు ఎదురవుతాయి. తనకే దొరికింది కాబట్టి ఆ దొరికిన వస్తువు తనదేనని చెప్తాడు అతను. దాని అసలు యజమాన్యం గురించి అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరోవైపు అతనికి కష్టంగా మారుతుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా బలహీనమైన వ్యక్తి తన వాదనను వినిపించుకోవడమే పెద్ద పోరాటం. ఇక్కడ కూడా అదే సమస్య కనిపిస్తుంది.
ఈ వ్యవహారం చిన్నపాటి విచారణతో ముగిసిపోదు. మత్స్యకారుడిపై వచ్చిన ఆరోపణలు క్రమంగా న్యాయపోరాటానికి దారి తీస్తాయి. ఒకవైపు చట్టం, మరోవైపు తన నిజాయితీపై నమ్మకం… బంగారు లాకెట్ విలువ ఎంత అన్నది మాత్రమే కాదు, దానిపై హక్కు ఎవరిది అనే ప్రశ్న కూడా కథలో కీలకంగా మారుతుంది. సామాన్యుడి చేతిలో విలువైన వస్తువు కనిపించగానే అతనిపై అనుమానం పెరగడం, తన మాటను నిరూపించుకోవడానికి అతను ఎదుర్కొనే అడ్డంకులు కథకు సామాజిక కోణాన్ని ఇస్తాయి.
ఈ కేసులో నిజం ఏంటి ? ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఒక చిన్న వస్తువు కోసం ఓ పేద వ్యక్తి ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ? మరి ఇంతకీ చేయని తప్పుకు అతను ఎలాంటి శిక్ష అనుభవించాడు ? మత్స్యకారుడి న్యాయ పోరాటం ఎలా సాగింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
Also Read : వయసు 50 దాటినా యాక్షన్లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్
‘ఎన్న విలై ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ’ అనే ఈ తమిళ సినిమా అక్టోబర్ 15 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా అందుబాటులో ఉండి. కాబట్టి తెలుగులో చూడాలనుకునే వారు హ్యాపీగా తెలుగులో చూడవచ్చు. ఇందులో కరుణాస్ (Karunas) మత్స్యకారుడి పాత్రలో కనిపించగా, నిమిషా సజయన్ (Nimisha Sajayan) కాంచన అనే న్యాయవాది పాత్రలో నటించారు. దర్శకుడు సజీవ్ పజూర్ (Sajeev Pazhoor) ఈ కథను కేవలం నేర విచారణగా కాకుండా, ఆత్మగౌరవం, హక్కులు, న్యాయవ్యవస్థ ముందు సామాన్యుడి స్థానం వంటి అంశాలతో ముడిపెట్టారు. న్యాయం కోసం పోరాడే ఈ సామాన్యుడి కథ వర్త్ వాచింగ్ అన్పిస్తుంది.