Feel Good Movie : మలయాళం నుంచి మరో సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక రోడ్ ట్రిప్ గా సాగే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. కేరళ నుండి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వరకు ఐదుగురు స్నేహితులు చేసే బైక్ ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కొచ్చి నుంచి బయల్దేరి వాయనాడ్, మైసూరు, నాసిక్ మీదుగా ఖజురహో చేరుకునే ప్రయాణాన్ని ఇందులో అందంగా చూపించారు. స్నేహితులు, ఫ్యామిలీతో కలసి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
మనోజ్ వాసుదేవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళ రోడ్ మూవీ పేరు ‘Khajuraho Dreams’. ఇందులో అర్జున్ అశోకన్, షరాఫ్ యు దీన్, శ్రీనాథ్ భాసి, ధ్రువన్, అదితి రవి ప్రధాన పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఖజురహో ఆలయ ప్రాంగణంలో షూటింగ్ జరుపుకున్న అరుదైన చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై, సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం Saina Play ఫిబ్రవరి 20 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఇది మలయాళ భాషలో అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ఈ కథ ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళంతా కలిసి కొచ్చి నుండి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వరకు ఒక లాంగ్ ట్రిప్ కి బైక్ రైడ్ ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణం కేవలం సరదా కోసం మాత్రమే కాదు, వాళ్ళ జీవితాల్లో ఉన్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుండి బయటపడటానికి, మనశ్శాంతిని వెతుక్కోవడానికి కూడా. ఇక ఆ దారిలో కొత్త పరిచయాలు, అందమైన ప్రదేశాలతో కథ చూడ చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రయాణంలో వాళ్ళు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారనేది దర్శకుడు చాలా నేచురల్‌గా చూపించారు. సినిమా క్లైమాక్స్‌లో ఖజురహో చేరుకున్నప్పుడు కలిగే అనుభూతి, ఆ ప్రదేశం గొప్పతనం ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది. స్నేహం , ట్రావెలింగ్‌లో ఉండే కిక్కును ఇష్టపడే వాళ్ళకి ఈ కథ బాగా నచ్చుతుంది.
Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా