E-Paper
Advertisement

Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు

Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు
Advertisement

Rain Alert: వేసవికాలం వస్తున్న తరుణంలో భారీగా వర్షాలు.. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వ్యవస్థ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ వైపు భారీగా తేమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా, ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం కూడా ఉంది.

ఈ జిల్లాలో భారీ వర్షాలు..
నేటి నుంచి మొదలుకుని మరో రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సూర్యాపేట, భద్రాచలం వంటి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 22న ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వర్షాలు ప్రారంభమై, 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన (Hailstorms) పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు – ఉక్కపోత..
వర్ష సూచన ఉన్నప్పటికీ, అల్పపీడన గమనం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు భద్రాచలంలో 36.2°C, ఆదిలాబాద్‌లో 35.8°C, ఖమ్మంలో 35.4°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 35-42% మధ్య ఉండటంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైతులకు హెచ్చరిక..
ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున, ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి పంటలు కోత దశలో ఉన్నందున, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వడగండ్ల వాన ముప్పు ఉన్నందున తోటల పెంపకందారులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

Also Read: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు.. చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి

జాగ్రత్తలు..
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, ప్రయాణీకులు వాతావరణ పరిస్థితులను గమనించి తదనుగుణంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాబోయే 48 గంటల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అధికారిక బులిటెన్లను ఫాలో అవ్వడం శ్రేయస్కరం.

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×