OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అన్ని భాషలలోనూ ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఒక హత్య కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
టెంట్ కొట్టా (Tentkotta) లో
ఈ తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫైర్’ (Fire). ఈ మూవీకి జేఎస్కే. సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో అమ్మాయిలను ప్రేమించి నట్టు నటిస్తూ, వాళ్ళ వీడియొ లను తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడుఒక డాక్టర్. ఒకరోజు అతడు కనిపించకుండా పోతాడు. ఈ కేసుతో స్టోరీ ముందుకు వెళుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 2025 ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. మార్చ్ 14 నుంచి ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ టెంట్ కొట్టా (Tentkotta) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కాశి అనే వ్యక్తి ఫిజియో తెరపిస్టుగా ఒక క్లినిక్ పెట్టుకుంటాడు. అయితే అక్కడికి ఒక పేషెంట్ మీనాక్షి వస్తుంది. ఆమెతో క్లోజ్ గా ఉంటూ తనకి ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఆఫీసులో ఉండే దుర్గతో క్లోజ్ అవుతాడు. నిన్ను ప్రేమించాను అంటూ తనతో ఏకాంతంగా గడుపుతాడు. ఆ తర్వాత అతని సెల్ ఫోన్ లో చాలా వీడియోలు ఉంటాయి. అందులో కాశి చాలామంది అమ్మాయిలతో ఏకాంతంగా గడిపినవే ఉంటాయి. దుర్గకి అసలు విషయం తెలిసి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని చెప్తుంది. ఏ స్టెప్ తీసుకున్నా వీడియోలను బయటపెడతానని బెదిరిస్తాడు కాశి. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది దుర్గ. దుర్గ సూసైడ్ చేసుకుంటూ ఉండగా ఆమె తండ్రి వచ్చి కాపాడతాడు. చనిపోవాల్సింది నువ్వు కాదని, వాడికి బుద్ధి వచ్చేలా చేస్తానని చెప్తాడు ఆమె తండ్రి. ఆ తర్వాత కాశీ కనిపించకుండా పోతాడు. కాశీ తల్లిదండ్రులు పోలీసులకు మా కొడుకు కనిపించట్లేదాని కంప్లైంట్ చేస్తారు.
పోలీస్ ఇన్స్పెక్టర్ కాశీని వెతిక ప్రయత్నం చేస్తాడు. అయితే అతనికి పరిచయం ఉన్న అమ్మాయిలను అందరిని ఎంక్వయిరీ చేస్తాడు. వాళ్లందరూ తమకు పరిచయం ఉన్నమాట వాస్తవమని, అతను ఏమయ్యాడో మాకు తెలియదని చెప్తారు. ఇంతలో ఇన్స్పెక్టర్ కి ఈ కేసులో దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. కాశి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి, వాళ్లని మినిస్టర్ దగ్గరికి డబ్బు కోసం పంపేవాడు. వీడి ఉచ్చులో చాలా మంది అమ్మాయిలు చిక్కి ఉంటారు. చివరికి పోలీస్ ఆఫీసర్ కాశీని పట్టుకుంటాడా? కాశీని ఎవరైనా చంపుతారా? మినిస్టర్ పరిస్తితి ఏమౌతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ టెంట్ కొట్టా (Tentkotta) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఫైర్’ (Fire) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.