Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేసేవాళ్లు ముందగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ప్రయాణానికి కొద్ది రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలంటే సాధ్యం అయ్యేపని కాదు. అయితే, పీక్ సమయాల్లో కొద్ది రోజులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నా, అంత త్వరగా కన్ఫర్మ్ చేయించుకోలేరు. సో, వాళ్లు వెయిటింగ్ లిస్టులో చేరుతారు. ఈ వెయిటింగ్ లిస్ట్ టికెట్లను రైల్వే పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంతకీ రైల్వే ఏ విధానాన్ని అనుసరించి టికెట్లను కన్ఫర్మ్ చేస్తుంది? వెయిటింట్ లిస్ట్ టికెట్ నిర్ధారణ విధానం ఎలా ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వెయిటింగ్ లిస్టు టికెట్లు ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే?
సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఏకంగా 500 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కన్ఫర్మ్ టికెట్ పొందడం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు. అయితే.. ఇలాంటి సమయంలో రైల్వే వెయిటింగ్ లిస్టు నిర్థారణను రెండు రకాలుగా చేస్తుంది. ఇంతకీ అవేంటంటే..
సాధారణంగా ప్రయాణీకులు రైలు కదిలే సమయం వరకూ టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటూనే ఉంటారు. వారి ప్లేస్ లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. మరో పద్దతిలో కొన్ని వెయిటింగ్ టికెట్లను కంపెనీ అత్యవసర కోటా ద్వారా కన్ఫర్మ్ చేయబడుతాయి. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులలో సుమారు 21 శాతం మంది తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. సో, 21 శాతం వెయిటింగ్ లిస్టు టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. మామూలుగా స్లీపర్ కోచ్ లో 72 సీట్లు ఉంటాయి. ఇందులో సుమారు 14 సీట్లు విడిగా అందుబాటులో ఉంటాయి. ఇరత ప్రయాణీకులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నప్పుడు దాదాపు 21 శాతం వెయిటింగ్ లిస్టు టికెట్లు కన్ఫర్మ్ అవుతాయని భావిస్తే, 18 సీట్లు కన్ఫర్మ్ అవుతాయి. సాధారణంగా ఒక రైల్లో 10 స్లీపర్ కోచ్ లు ఉంటే.. ప్రతి కోచ్ లో 18 సీట్లు కన్ఫర్మ్ అవుతాయి. మొత్తంగా 180 వెయిటింగ్ లిస్టు టికెట్లు కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంది. ఇక థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్ లకు సైతం ఇదే పద్దతి కొనసాగుతుంది.
Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు!
రైల్వే కోటాలో 10 శాతం టికెట్లు
ఇక 10 శాతం రైల్వే సంస్థ అత్యవసర కోటాలో సీట్లు ఉంటాయి. ఈ సీట్లను సాధారణంగా అనారోగ్యం, అత్యవసర ప్రయాణీకులకు రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సీట్లలో 5 శాతం ఉపయోగిస్తే, మిగిలిన 5 శాతం వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, రైల్వే సంస్థ వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇదే పద్దతి ద్వారా కన్ఫర్మ్ చేస్తుంది. ఆయా పరిస్థితులు, టికెట్ల రద్దు విధానాల ఆధారంగా ప్రయాణీకులకు టికెట్లను కేటాయిస్తుంది.
Read Also: హైదరాబాద్ మెట్రోలో చేతులు పట్టుకున్న జంట.. ఇది అమెరికా కాదంటూ క్లాస్!