Matrimony fraud: కష్టపడటానికి ఇష్టంలేని కొందరు యువకులు.. సులువుగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. తమ టాలెంట్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా అరెస్టులు పాలవుతున్నారు. అలాంటి ఘటన ఒకటి ఏపీలో వెలుగుచూసింది. ఓ ఘరానా మోసగాడు ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆపై పోలీసులకు చిక్కాడు. అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
పైన కనిపిస్తున్న వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి. సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. బీటెక్ మధ్యలో ఆపేసి పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. సిటీలకు వచ్చినవారు లైఫ్‌లో సెటిల్ అవ్వాలని యువతీ యువకులు కోరుకోవడం సహజం. జల్సాలకు అలవాటు పడ్డాడు. సునాయశంగా డబ్బలు సంపాదించాలని భావించాడు. చివరకు అడ్డుదారులు తొక్కాడు. మనోడు అతి తెలివి తేటలకు ఎలాంటోడైనా బుట్టలో పడాల్సిందే.
తొలుత ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. తొలుత డబ్బులు బాగానే వచ్చాయి. ఆ తర్వాత దాన్ని వృత్తిగా ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఎనిమిదేళ్ల కిందట ఓ జాబ్ కన్సల్టెన్సీలో చేరాడు. యువకులను ఉద్యోగాల పేరిట మోసం చేశాడు ఆపై అరెస్ట్ అయ్యాడు. మరి జైలులో మారాడా? అంటే అదీ లేదు. జైలులో ఉన్న సమయంలో తన బుర్రకు పదును పెట్టాడు.
జైలు నుంచి విడుదలై తర్వాత సోషల్ మీడియా ద్వారా మహిళల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించాడు. తన ఆదాయంలో అధిక శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. చాలామందిని నమ్మించాడు. నిజమేనని చాలామంది నమ్మేశారు. దాదాపు 1000 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు.
ALSO READ: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమదం
రకరకాలుగా మోసాలు
సీన్ కట్ చేస్తే.. యానాంలో ఓ శాసనసభ్యుడి ఫొటోని డీపీగా పెట్టుకున్నాడు. ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ దాదాపు 50 మంది యువతీ యువకులను దాదాపు రూ.2.50 కోట్లు కాజేశాడు. సులువుగా డబ్బులు సంపాదించడమానికి కొత్త మార్గాలను అన్వేషించాడు.
మ్యాట్రిమోనీ సైట్లను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. తప్పుడు సమాచారంతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల వేదికగా పలువురు యువతులను మోసం చేశాడు. కేవలం వంశీకృష్ణ మోసాలు తెలంగాణకు పరిమితం కాలేదు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించాయి. భారీ మొత్తంలో డబ్బు కాజేశాడు. అయినా వంశీకృష్ణ దాహం మాత్రం తీరలేదు.
చివరకు మహిళలే టార్గెట్‌గా
తాను ఎన్నారై, బిజినెస్‌మేన్, ఐటీ ఉద్యోగినంటూ రకరకాలుగా యువతులను మభ్యపెట్టేవాడు. మ్యారేజ్‌ల కోసం మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో అమ్మాయిల వివరాలు డీటేల్స్ తెలుసుకునేవాడు. 30 ఏళ్లు దాటిన వారిని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నాడు.. ఆపై వల విసిరేవాడు. వాట్సప్ కాల్ ద్వారా వారితో మంతనాలు జరిపేవాడు.
ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతి గచ్చిబౌలీలో డాక్టర్‌గా పని చేస్తోంది. తాను అమెరికాలో డాక్టర్ అని, ప్రస్తుతం స్థానికంగా వ్యాపారాలు చేస్తున్నానని ఆ యువతిని నమ్మించాడు. అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లి చేసుకుందామని చెప్పగానే సరేనని చెప్పింది ఆ యువతి. అక్కడి నుంచి తన డ్రామా మొదలు పెట్టాడు.
తన బ్యాంకు ఖాతాలు ఐటీ అధికారులు ఫ్రీజ్ చేశారని నమ్మించాడు వంశీకృష్ణ. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 25లక్షల వరకు కాజేశాడు. బాధితులు డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తే.. వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరించేవాడు. కాజేసిన సొమ్ముతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడేవాడు. డాక్టర్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వంశీకృష్ణ పాపం కూడా పండింది. ఈనెల 13న బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. మ్యాట్రీమోనీ సైట్ల ద్వారా ఏకంగా 24 మంది యువతులకు గాలం వేశాడు.
పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు చేస్తున్న యువకుడు అరెస్ట్
మ్యాట్రీమోనీ డాట్ కామ్ ద్వారా ఏకంగా 24 మంది యువతులకు గాలం వేసిన వంశీ చెరుకూరి
అత్యవసరంగా డబ్బులు కావాలని మాయమాటలు
పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని అమ్మాయిల నగ్న వీడియోలు తెప్పించుకున్న వంశీ
ఆ వీడియోలను అడ్డంపెట్టి యువతుల… pic.twitter.com/onWT904ezY
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2025