Thriller Movies OTT : మలయాళ సినిమాలు వేరే భాషల్లో కూడా డబ్ చేస్తారు. అక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటాయి. చిన్న కథ చుట్టే సినిమా మొత్తం చూపిస్తారు. ఆ చిక్కు ముడిని విప్పడంలోనే ట్విస్టు లను ఇస్తారు. ఇక క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వస్తున్న సినిమాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ మధ్య ఎలాంటి కథతో వచ్చిన మలయాళ సినిమా అయితే చాలు హిట్ అవుతున్నాయి. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ ఈ ఇండస్ట్రీ.. ఇప్పుడు ఒకేసారి నాలుగు థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకున్నాయి. ఆ మూవీలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఐడెంటిటీ..
చైన్నై బ్యూటీ త్రిష, టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఐడెంటిటీ.. ఈ మూవీ జనవరి 31వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కథతో రాబోతుంది. అఖిల్ పౌల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి 2న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. గత వారం తెలుగులోనూ వచ్చింది. ఈ చిత్రం ఓవరాల్‍గా సుమారు రూ.18కోట్ల కలెక్షన్లు అందుకొని యావరేజ్ మూవీ గా నిలిచింది. ఇక మూవీ థియేటర్లలోకి విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. మరీ ఇక్కడైన మంచి టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి..
మార్కో..
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ మార్కో.. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది.. మోస్ట్ వైలెంట్ మలయాళ చిత్రంగా పాపులర్ అయిన ఈ సినిమా రూ.120కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసి.. బ్లాక్‍బస్టర్ కొట్టేసింది.. మలయాళం ను రిలీజ్ అయినయి మూవీ రెండు వారాల తర్వాత తెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కూడా మంచి హిట్ టాక్ ని అందుకోవడంతో భారీగా కలెక్షన్స్ ని వసూలు చేసింది. మార్కో చిత్రం త్వరలో ఫిబ్రవరి నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడ్డాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ దక్కించుకుందనే సమాచారం.. త్వరలోనే ఈ మూవీ ఓటిటి డీటెయిల్స్ వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
రేఖా చిత్రం..
మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన క్రైమ్ ట్రేలర్ మిస్టరీ మూవీ రేఖాచిత్రం.. రూ.6 కోట్లతో ఈ చిత్రం రూపొందగా.. రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటి బ్లాక్‍బస్టర్ అయింది. మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలో నటించగా.. నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు.. ఒక ఆత్మహత్య కేసు చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ సినిమా కథ ఉంటుంది. ఈ మూవీని దర్శకుడు జోఫిన్ టీ చాకో తెరకెక్కించారు. రేఖా చిత్రం కూడా ఫిబ్రవరిలో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ హక్కులను సొంతం చేసుకుంది.
రుధిరం..
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రుధిరం.. డిసెంబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేక ప్లాఫ్‍గా నిలిచిపోయింది. ఈ మలయాళ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ రాజ్ బీ శెట్టి, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించారు. ఇక జిషో లాన్ ఆంటోనీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఇక ఈ మూవీ ఫిబ్రవరి నెలలో ఓటిటిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ ఓటిటి డీటెయిల్స్ ను అనౌన్స్ చెయ్యనున్నారు.. ఈ నాలుగు సినిమాలు థియేటర్లలో మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి ఇక ఓటిటిలో ఎలాంటి హిట్ టాక్ని అందుకుంటాయో చూడాలి..