BigTV English

Daggubati Rana : దగ్గుబాటి ఇంట్లో విషాదం… పాడె మోసిన రానా..!

Daggubati Rana : దగ్గుబాటి ఇంట్లో విషాదం… పాడె మోసిన రానా..!

Daggubati Rana :సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు అభిమానులను ఇటు సినీ సెలబ్రిటీలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్లో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి (Daggubati) ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh babu) అత్త (భార్య తల్లి) కన్నుమూశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య, యలమర్తి రాజేశ్వరి దేవి కన్నుమూశారు. అయితే ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. దగ్గుబాటి రానా (Daggubati Rana) కు రాజేశ్వరి దేవి స్వయానా అమ్మమ్మ అవుతుంది. అంత్యక్రియలలో పాల్గొన్న దగ్గుబాటి రానా తన అమ్మమ్మ రాజేశ్వరి దేవి పాడెను మోసారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి దేవి అల్లుడు దగ్గుబాటి సురేష్ తో పాటు ఆయన కుమారుడు దగ్గుబాటి రామానాయుడు (జూనియర్) ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇక రానా తన అమ్మమ్మ పాడే మోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజెన్స్, అభిమానులు సెలబ్రిటీలు అయినా సరే బంధాలకు, బంధుత్వాలకు తల వంచాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


రానా దగ్గుబాటి కెరియర్..

దగ్గుబాటి రానా బహుభాషా చలనచిత్ర నటుడిగా పేరు దక్కించుకున్నారు. నటుడు గానే కాదు నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన ఎవరో కాదు మూవీ మొఘల్ దివంగత సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడే. ‘లీడర్’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. రానా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలకు పనిచేశాడు. అంతేకాదు ఈయనకి ‘స్పిరిట్ మీడియా’ అనే సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇక 2010లో నటన రంగంలోకి అడుగుపెట్టారు రానా.


రానా వ్యక్తిగత జీవితం..

వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1984 డిసెంబర్ 14వ తేదీన దగ్గుబాటి సురేష్, దగ్గుబాటి లక్ష్మీ దంపతులకు జన్మించారు. ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్ లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చెన్నైలోనే చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్న ఈయన ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాదులోనే నివసిస్తున్నాడు. 2020లో మిహికా బజాజ్ తో రానా ఏడడుగులు వేశారు.. ఇక ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2020 మే 21న వీరి నిశ్చితార్థం జరగగా.. ఆగస్టు 8న వివాహం జరిగింది. లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో భల్లాల దేవ గా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన 2022లో ‘విరాటపర్వం’ సినిమాలో నటించారు. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. అలాగే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ బిజీగా మారారు

Related News

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Stories

×