Jobs in Bharat Electronics: బీఈ, బీటెక్, బీఎస్సీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీగా జీతం కల్పిస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. ఎల్లుండి జనవరి 31న దరఖాస్తుకు గడువు ముగియనుంది.
నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ప్రొబిషనరీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం కల్పిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350
కేటగిరీల వారీగా ఉద్యోగాలు..
యూఆర్-143
ఈడబ్ల్యూఎస్-35
ఓబీసీ-94
ఎస్సీ- 52
ఎస్టీ- 26
ఇందులో ప్రొబిషనరీ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొబిషనరీ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-200, ప్రొబిషనరీ ఇంజనీర్(మెకానికల్)-150 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ప్రొబిషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 200 ఉద్యోగాలు
ప్రొబిషనరీ ఇంజనీర్(మెకానికల్)- 150 ఉద్యోగాలు
విద్యార్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత అయ్యి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: 25 ఏళ్ల వయస్సు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది)
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31
దరఖాస్తు ఫీజు: రూ.1000 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.)
క్వాలిఫైంగ్ మార్కులు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 125 ప్రశ్నలకు నిర్వహిస్తారు. 120 నిమిషాల సమయం ఉంటుది. ఇందుల 100 మార్కులు టెక్నికల్ నుంచి, 25 మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనంతరం ఫైనల్ లిస్ట్‌లో పేరు ఉన్న వారు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వేతనం ఉంటుంది(ఏడాదికి రూ.13లక్షలు జీతం ఉంటుంది). డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/
Also Read: Engine Driver Jobs: కొచ్చిన్ షిప్ యార్డులో ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
అర్హతలున్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాదికి రూ.13లక్షల జీతం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెండు రోజులే గడువు ఉంది. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31
దరఖాస్తు ఫీజు: రూ.1000 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు)
వయస్సు: 25 ఏళ్లు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది)
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 350