BigTV English

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : దర్శకులు హీరోలుగా మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఈ ఆచారం వస్తోంది. కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి. దర్శకుడిగా, నటుడిగా తనదైన ఒక మార్క్ వేశాడు. ఈ హీరో హారర్, కామెడీ, యాక్షన్ లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు నుంచి ఒక యాక్షన్ కామెడీ మూవీ ఈ ఎడాది థియేటర్లలోకి వచ్చింది. నెల తిరక్కుండానే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో సుందర్ సి. నటుడిగా, దర్శకుడిగా మరోసారి తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సినిమాలో వడివేలు కామెడీ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘గ్యాంగర్స్’ (Gangers) 2025లో విడుదలైన తమిళ హీస్ట్ యాక్షన్ కామెడీ మూవీ. సుందర్ సి. డైరెక్ట్ చేసిన చిత్రంలో సుందర్ సి., వడివేలు, కేథరిన్ ట్రెసా, వాణి భోజన్ లీడ్ రోల్స్‌లో నటించగా, బాగవతి పెరుమాళ్, మైమ్ గోపి, హరీష్ పెరడి సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. అవ్నీ సినిమాక్స్, బెంజ్ మీడియా బ్యానర్‌లపై ఖుష్బూ, సుందర్ సి. నిర్మించిన ఈ సినిమా, 2025 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలై, అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 మే 15 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 39 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.8/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

సరవణన్ (సుందర్ సి.), ఒక అండర్‌కవర్ కాప్. తమిళనాడులోని ఓ చిన్న పట్టణంలోని అరసన్ హైస్కూల్‌లో PT మాస్టర్‌గా జాయిన్ అవుతాడు. ఈ పట్టణాన్ని మలయరాసన్, కొట్టయ్యరాసన్ అనే ఇద్దరు క్రిమినల్ బ్రదర్స్ తమ నియంత్రణలో పెట్టుకుంటారు. వీళ్లు కిడ్నాపింగ్, హత్యలు, ఇతర అక్రమాల్లో మునిగిపోయి ఉంటారు. స్కూల్ టీచర్ సుజిత తన స్టూడెంట్ రమ్య మిస్సింగ్ కేసును పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఆమె DGP దగ్గరకి వెళ్తుంది. DGP సరవణన్‌ని ఈ కేసు కోసం అండర్‌ కవర్‌గా పంపిస్తాడు. సరవణన్ స్కూల్‌లో చేరి, స్థానిక డాన్‌లను ఎదిరిస్తూ, వాళ్ల అన్న ముదియరాసన్ 100 కోట్ల స్కామ్‌లో ఇన్వాల్వ్ అయినట్లు తెలుసుకుంటాడు. స్కూల్ PT టీచర్ సింగరం (వడివేలు), సుజిత, ఇతర స్టాఫ్‌తో కలిసి సరవణన్ “గ్యాంగర్స్” టీమ్‌ని ఫార్మ్ చేస్తాడు.


ఫస్ట్ హాఫ్‌లో సరవణన్, సింగరం మధ్య కామెడీ, సుజితతో సింగరం రొమాంటిక్ యాంగిల్, స్కూల్‌లోని సమస్యలు ఫోకస్‌లో ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో హీస్ట్ ప్లాన్ మొదలవుతుంది. సరవణన్ టీమ్ ముదియరాసన్ నుంచి 100 కోట్ల బ్లాక్ మనీని దొంగిలించేందుకు క్విర్కీ ప్లాన్ వేస్తుంది. వడివేలు కామెడీ, సరవణన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సెకండ్ హాఫ్‌ని ఎంటర్‌టైనింగ్‌గా మారుస్తాయి. క్లైమాక్స్‌లో సీక్వెల్‌కి హింట్ ఇస్తూ కథ ముగుస్తుంది. సరవణన్ రమ్య మిస్సింగ్ కేసును ఛేదిస్తాడా ?100 కోట్ల బ్లాక్ మనీ మ్యాటర్ ఏంటి ? సరవణన్, సుజిత లవ్ ట్రాక్ ఏమవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Related News

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

Big Stories

×