OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రకరకాల స్టోరీలతో వస్తుంటాయి. అయితే కంటెంట్ మొత్తం నేరాల చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్ని సినిమాలు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తే, మరికొన్ని ఇంటెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని టెన్షన్ పెట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చంబల్ రీజియన్‌లో, ఓ సాధారణ అమ్మాయి అసాధారణ పరిస్థితుల్లో బతకడానికి చేసే పోరాటమే ఈ కథ. ఇది ఓటీటీలో రిలీజ్ అయిన మొదటి వారంలో 48 లక్షల వ్యూస్‌తో ఇండియన్ కంటెంట్‌లో టాప్-4లో నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘అపూర్వ’ (Apurva) 2023లో విడుదలైన హిందీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. నిఖిల్ నాగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారా సుతారియా టైటిల్ రోల్‌లో నటించగా, రాజ్‌పాల్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, ధైర్య కర్వా కీలక పాత్రల్లో నటించారు. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 2023 నవంబర్ 15 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 1 గంట 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది.
అపూర్వ కశ్యప్ గ్వాలియర్ నుంచి అగ్రాకు బస్సులో తన ఫియాన్సీ సిద్ధార్థ్ ని సర్‌ప్రైజ్ చేయడానికి బయల్దేరుతుంది. అదే సమయంలో చంబల్ రీజియన్‌లో జుగ్ను, సుఖా, బల్లీ, చోటా అనే నలుగురు డాకోయిట్ల గ్యాంగ్ దోపిడీలు, హత్యలు చేస్తూ ఉంటుంది. బస్సు డ్రైవర్ వీళ్ల కారును ఓవర్‌టేక్ చేయడానికి నిరాకరించడంతో, జుగ్ను కోపంతో డ్రైవర్, కండక్టర్‌ని చంపి, బస్సు ప్రయాణికులను దోచుకుంటారు. ఈ సమయంలో అపూర్వ తన ఫోన్‌ని దాచడానికి ప్రయత్నిస్తుంది, కానీ సుఖా దాన్ని చూసి, సిద్‌తో ఫోన్‌లో గొడవ పడి, అపూర్వని కిడ్నాప్ చేసి మారుమూల ప్రాంతంలోకి తీసుకెళ్తారు.
అపూర్వ బతకడానికి తన తెలివిని, ధైర్యాన్ని ఉపయోగించి గ్యాంగ్‌తో పోరాడుతుంది. ఆమె తన మీద అఘాయిత్యం చేయడానికి వస్తున్న చోటాని చంపి, అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. కానీ గ్యాంగ్ ఆమెను వెంటాడుతుంది. అపూర్వ సిద్‌కి ఫోన్ చేసి గ్యాంగ్ వివరాలు చెప్పినా, పోలీసులు ఉదయం వరకు వేచి ఉండమని సలహా ఇస్తారు. బల్లీ కూడా ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అపూర్వ అతన్ని గాయపరిచి, జుగ్నుని బావిలోకి తోసి చంపుతుంది. చివరి ఘట్టంలో సుఖాతో రైల్వే ట్రాక్ దగ్గర పోరాడుతుంది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒక వక్ర ఆలోచనను ఆమెతో చెప్తాడు. అయితే అపూర్వ అతన్ని ఎదిరించి నిలబడుతుంది. ఈ కథ లో అపూర్వ సేఫ్ గా బయట పడుతుందా ? తన బాయ్ ఫ్రెండ్ ని కలుస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్