BigTV English

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా
Advertisement

OTT Movie : స్లాషర్ కంటెంట్ తో రొమాంటిక్ వైబ్‌ ను తెసుకొచ్చిన ఒక హాలీవుడ్ సినిమా, ఆడియన్స్ ని గట్టిగానే ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ కథ వాలెంటైన్స్ డే సమయంలో ప్రేమికులను, ఒక కిల్లర్ దారుణంగా చంపుతుంటాడు. ఈ క్రమంలో ఒక జంట లవ్ లో పడుతూ, ఆ కిల్లర్ ని ఎదుర్కుంటారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలో కూడా టాప్ వ్యూస్ తో నడుస్తోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో అంటే

‘హార్ట్ ఐస్’ (Heart Eyes) ఒక అమెరికన్ రొమాంటిక్ కామెడీ స్లాషర్ చిత్రం. జోష్ రూబెన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఒలివియా హోల్ట్, మేసన్ గూడింగ్, గిగి జుంబాడో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయింది. 2025 మే 8 నుండి Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమా 6.0/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

ఒక సిటీలో వాలెంటైన్స్ డే సమయంలో ఈ కథ జరుగుతుంది. హార్ట్ ఐస్ అనే సీరియల్ కిల్లర్ ఏటా వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులను టార్గెట్ చేసి చంపుతుంటాడు. అతను లవర్స్ ను చంపి బాడీస్ పక్కన “హార్ట్ ఐస్” సింబల్‌తో ఒక లవ్ మెసేజ్ కూడా పెడుతుంటాడు. అందుకే అతనికి ఈ పేరు వచ్చింది. అతను హార్ట్ షేప్ మాస్క్ వేసుకుని ఉండటంతో కిల్లర్ ఫేస్‌ను ఎవరూ చూసి ఉండరు. మరో వైపు అల్లీ, జే అనే వీళ్లు ఒక గిఫ్ట్ కార్డ్ కంపెనీలో కో-వర్కర్స్ గా ఉంటారు. అల్లీకి రీసెంట్‌గా తన బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యింది. దీంతో ఆమె వాలెంటైన్స్ డేని హేట్ చేస్తుంటుంది. జే కూడా సింగిల్ గా ఉంటాడు. కానీ అల్లీతో ఫన్నీగా మాట్లాడుతూ ఆమెతో కంఫర్ట్ గా ఉంటాడు. వీళ్లు ఆఫీస్‌లో ఇప్పుడు ఓవర్‌టైమ్ పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డే ఉండటంతో కంపెనీకి బిజినెస్ ఎక్కువగా జరుగుతుంటుంది.


Read Also : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

అయితే సినిమా స్టార్టింగ్ లో కిల్లర్ ఒక కపుల్‌ను చంపేస్తాడు. పోలీసులు కిల్లర్‌ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అల్లీ, జే ఆఫీస్‌లో డెకరేషన్స్ సెట్ చేస్తూ ఉంటారు. ఇది కిల్లర్ దృష్టిలో పడుతుంది. కిల్లర్ వీళ్లను ప్రేమికులుగా అపార్థం చేసుకుంటాడు. వాళ్లను టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అల్లీ, జే ఆఫీస్‌లో ఉండగా, కిల్లర్ ఆఫీస్‌కు ఎంటర్ అవుతాడు. అతను హార్ట్ షేప్ మాస్క్ వేసుకుని, కత్తితో అటాక్ చేస్తాడు. అల్లీ, జే భయపడి పారిపోతారు.అయితే ఈ సమయంలో అల్లీ, జేను లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కిల్లర్ ప్రేమలో ఫైల్ అవ్వడం వల్ల, ఈ హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఫైనల్ చేజ్ సీన్ ఆఫీస్ రూఫ్‌ టాప్‌లో జరుగుతుంది. అల్లీ, జే కలిసి కిల్లర్‌తో ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ లో ఏం జరుగుతుంది ? కిల్లర్‌ నుంచి వీళ్ళు బయట పడతారా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×