OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా కూతురుని బంధించి, ఆమెతోనే పిల్లలను కంటాడు ఓ కసాయి తండ్రి. వీళ్ళిద్దరి మధ్య మూవీ స్టొరీ తిరుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గర్ల్ ఇన్ ద బేస్మెంట్‘ (Girl in the basement). కన్న కూతురిని సంవత్సరాలపాటు బంధించి, ఆమెతోనే కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. ఆమె అందులో పడే ప్రాబ్లమ్స్ తో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సారా తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సిటీలో జాబ్ చేయాలనుకుంటుంది. సారా కి తన తండ్రితో అంతగా బాండింగ్ ఉండదు. ఆమె తల్లితోనే ఎప్పుడూ సరదాగా ఉంటుంది. సారా సిటీకి వెళ్లిపోతుందని తెలుసుకున్న తండ్రి, ఆమె మీద ఎప్పటినుంచో కన్ను ఉండటంతో ఒక పథకం వేస్తాడు. ఆ ఇంట్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి బేస్మెంట్ ఉంటుంది. అది తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. అయితే ఒక రోజు సారా తో పని ఉందని బేస్మెంట్ కి తీసుకెళ్తాడు. ఇక బేస్మెంట్ లోనే ఆమెను బంధిస్తాడు. అందులో ఉండే డోర్ కి ఒక సీక్రెట్ లాక్ పెడతాడు. కూతురు మీద ఎప్పటినుంచో కన్నుపడ్డ తండ్రి, ఆమెను నేను చెప్పినట్లు వింటే వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆమెను తనతో గడపమని చాలా రోజులు ఒత్తిడి చేస్తాడు. ఇలా కొన్ని నెలలు జరుగుతాయి. ఇంట్లో వాళ్లకి ఆమె ఎవరితోనో లేచిపోయి ఉంటుందని నమ్మిస్తాడు. చేసేదేం లేక తండ్రి చెప్పినట్టు నడుచుకుంటుంది కూతురు. ఆమె తప్పించుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతూ ఉంటుంది.
కూతురు తండ్రి వల్ల ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఒకసారి కూడా కాదు, రెండుసార్లు ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక కొడుకు, కూతురు తండ్రి వల్ల కలుగుతారు. వాళ్లు కూడా బయటికి పోలేక ఆ బేస్మెంట్ లోనే పెరుగుతూ ఉంటారు. ఒకరోజు సారా కూతురు కి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. తండ్రిని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చాలా బ్రతిమాలుతుంది. చివరికి తండ్రి సారా కూతుర్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడా? పోలీసులు సారా ఎక్కడుందో కనిపెడతారా? ఆ బేస్మెంట్ నుంచి కూతురు బయటపడగలుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గర్ల్ ఇన్ ద బేస్మెంట్’ (Girl in the basement) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.