Tollywood Actress : సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఈరోజు అవకాశాలు ఉన్నాయి అనుకొనేలోపు రేపు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. స్టార్ ఇమేజ్ ను అందుకున్న స్టార్స్ తప్ప చిన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు పెద్దగా రావనే చెప్పాలి. అందుకే ఒకటి రెండు సినిమాలకే కొందరు హీరోయిన్లు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు.. అలా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అందులో కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు కూడా ఉంది. ఈమె కేరీర్ ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు సినిమా అవకాశాలు పలకరించేవి కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడుంది? అని తెలుసుకోవాలని చాలా మంది వెతికేస్తున్నారు. ఇంతకీ శ్వేతా బసు ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టని విధంగా మారిపోయింది.. ఆ ఫోటోలలో ఆమె రూపు రేకలు పూర్తిగా మారిపోయాయి. నిజంగానే శ్వేతా బసు అంటే సడెన్ గా చూసిన వాళ్ళు నమ్మడం కష్టమే.. బీహార్ లో జన్మించిన శ్వేతా బసు ప్రసాద్ 2002 సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక ఈ బ్యూటీ చిన్నతనంలోనే కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆమె కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా చేసిన ఈమె మొదట్లో యాడ్స్ చేసింది. దాంతో ఆమె నటనకు ఫిదా అయిన డైరెక్టర్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. అలా తన సినీ కేరీర్ మొదలైంది.
ఇక ఆ తర్వాత 2005 లో తొలిసారి ఇక్బాల్ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. ఇక తెలుగులో 2008లో కొత్త బంగారం లోకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది అందాల తార. స్వప్న అనే పాత్రలో కనిపించి క్యూట్ యాక్టింగ్, చబ్బీ లుక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.. పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న ఆశించిన స్థాయిలో హిట్ సినిమాలను మాత్రం అందుకోలేకపోయింది. కొత్త బంగారులోకం సినిమా తర్వాత ఈ భామకు గ్యాప్ లేకుండా తెలుగులో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఆ మూవీస్ ఒక్కటి కూడా పాపకు పేరును తీసుకురాలేదు. దాంతో అవకాశాలు ఆవిరి అయ్యాయి. క్రమంగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమె బ్రేకప్ చెప్పింది. ఆ ప్రేమ వ్యవహారాల వలన ఆమె కొన్నాళ్లు డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. పుట్టిన రోజు వేడుకల్లో కనిపించిన శ్వేత బసు ప్రసాద్‌అందరినీ షాక్‌కి గురి చేసింది. శ్వేతను చూసిన నెటిజన్లు ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో నటిస్తుందని టాక్…