BigTV English

OTT Movie : మనుషిని వదిలేసి బొమ్మను ప్రేమించే ఘనుడు… మొహమాటం ఎక్కువ అయితే ఇలానే ఉంటుంది..

OTT Movie : మనుషిని వదిలేసి బొమ్మను ప్రేమించే ఘనుడు… మొహమాటం ఎక్కువ అయితే ఇలానే ఉంటుంది..

OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు బాగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. మొహమాటం ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. విపరీతమైన మొహమాటం ఉండే ఒక వ్యక్తి బొమ్మను ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ హాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లార్స్ అండ్ ది రియల్ గర్ల్‘ (Lars and the real girl). ఈ మూవీకి క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహించారు.  ‘లార్స్ అండ్ ది రియల్ గర్ల్’ మెట్రో గోల్డ్‌విన్ మేయర్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. వాణిజ్యపరంగా విఫలమైనప్పటికీ, ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒంటరి జీవితానికి బాగా అలవాటు పడి ఉంటాడు. తన అన్న, వదినతో కాకుండా అవుట్ హౌస్ లోనే కంఫర్ట్ గా ఉంటాడు. ఇతనికి ఎంత మొహమాటం అంటే, అన్న, వదిన భోజనానికి రమ్మని పిలిచినా కూడా రానంతగా ఉంటుంది. ఎన్నిసార్లు పిలిచి నా భోజనానికి రాకపోవడంతో, ఒకరోజు బలవంతంగానే ఇంటికి తీసుకువెళ్తారు. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్ ఒక బొమ్మని ఆర్డర్ చేస్తాడు. మనకు నచ్చిన రూపంలో, కావాల్సిన బొమ్మను ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చని తెలుసుకుంటాడు. అలా తనకు నచ్చిన ఒక బొమ్మను ఇంటికి తీసుకు వెళ్తాడు. ఆ బొమ్మని తన గర్ల్ ఫ్రెండ్ అంటూ ఇంట్లో వాళ్లకి పరిచయం చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఇంట్లో వాళ్లకి హీరోనీ డాక్టర్ కి చూపించాలని. బొమ్మతో మాట్లాడుతూ, గొడవ పడుతూ, అలుగుతూ ఉండటంతో ఒకసారి బొమ్మకు బాగోలేదని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే హీరో కూడా హాస్పిటల్ కి రావడానికి అలా చెప్తారు.

సైకాలజిస్ట్ హీరోని చెక్ చేసి అతనికి లోపం ఏమీ లేదని తెలుసుకుంటుంది. ఒంటరి జీవితం గడపడం వలన ఆ బొమ్మకు ప్రాణం ఉన్నట్టు ఊహించుకుంటున్నాడని చెప్తుంది. ఆ బొమ్మ చనిపోతే ఇతడు మళ్లీ మామూలు స్థాయికి వస్తాడని అంటుంది. ఆ తర్వాత తన ఆఫీసులో పనిచేసే మార్గో అనే అమ్మాయి హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. అయితే హీరో మాత్రం బొమ్మను ప్రేమిస్తూ ఉంటాడు. హీరో మంచివాడు కావడంతో, చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా ఆ బొమ్మకు ప్రాణం ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. అయితే అనుకోకుండా ఒక రోజు ఆ బొమ్మకు ఆరోగ్యం బాగా లేదంటూ హీరో హాస్పిటల్ కి తీసుకు వస్తాడు. చివరికి హాస్పిటల్ కి తీసుకువచ్చిన ఆ బొమ్మకు ఏమవుతుంది? ఇతని మానసిక స్థితి కుదుటపడుతుందా? ఇంత మొహమాటం ఉన్న హీరో సమాజంలో ఎలా బ్రతుకుతాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×