Unstoppable Ram Charan Episode Part 2 :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ (Balakrishna) ఈమధ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు నాల్గవ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chadrababu Naidu)తో మొదటి ఎపిసోడ్ ప్రారంభించగా.. ఇప్పుడు 9వ ఎపిసోడ్ పార్ట్2 స్ట్రీమింగ్ అవుతోంది. అందులో భాగంగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (రామ్ చరణ్) తన సినిమా గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సంక్రాంతి సందర్భంగా మొదటి పార్ట్ విడుదల చేసిన మేకర్స్.. ఇప్పుడు రెండవ పార్ట్ కూడా విడుదల చేశారు.
మనసులో కోరిక బయటపెట్టిన సుస్మిత..
ఇక ఇందులో ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించి ప్రస్తావించిన రామ్ చరణ్, తొలిసారి సోదరీమణుల గురించి ప్రస్తావించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా రామ్ చరణ్ అక్క సుస్మిత (Susmita).. రామ్ చరణ్ తో సమయం గడపాలని, కాకపోతే రామ్ చరణ్ బిజీ షెడ్యూల్ కారణంగా తమతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అంటూ తెలపింది. ముఖ్యంగా “తమ్ముడితో టైం గడపాలనుకున్నప్పటికీ.. తమ్ముడు ఎప్పుడు బిజీగా ఉంటాడు. కాబట్టే అతడితో సమయాన్ని గడపలేక పోతున్నాము. తమ్ముడు ఒకే ఇంట్లో ఉన్నా చాలా మిస్ అవుతున్నాం “అంటూ సుస్మిత ఒక లెటర్ పంపించి తన మనసులో ఉన్న భావోద్వేగాన్ని అలా పంచుకుంది. ఇక అలాగే రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ (Sreeja ) కూడా తన అన్నయ్య తనకు పిల్లర్ లాంటివాడు అని, తనకు ఏ కష్టం వచ్చినా సరే ముందుండి కష్టాన్ని ఇట్టే తీర్చేస్తాడని తెలిపింది.
తర్వాత సుస్మిత ఒక లెటర్ పంపించింది. ఆ లెటర్ ను చదివి వినిపించాలని, కచ్చితంగా ఈ ఏడాది ఫుల్ ఫిల్ చేయాలని కూడా కోరింది. ఇక ఆ లెటర్లో 2025లో చరణ్ నీతో పాటు నేను, శ్రీజ మన ముగ్గురం కలిసి ఏదైనా వెకేషన్ కి వెళ్ళాలి. ఈ నా కోరికను కచ్చితంగా ఈ ఏడాది నెరవేరుస్తావని ఆకాంక్షిస్తున్నాను అంటూ సుస్మిత ఆ లెటర్లో కోరింది. ఇక అది చదివిన రామ్ చరణ్ కూడా తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను అక్క అంటూ మాట ఇచ్చారు
శ్రీజ ఏదీ అడగదంటున్న రామ్ చరణ్..
ఇక అలాగే ఇంట్లో తాము ముగ్గురు ఎలా ఉంటారు అనే విషయం గురించి కూడా మాట్లాడుతూ.. అక్క కాస్త కోపం ఎక్కువ. కాబట్టి ఆమె దగ్గర మేము చాలా సైలెంట్ గా ఉంటాము. శ్రీజ మాత్రం ఎవరి దగ్గర ఏదీ అడగదు. ఎవరిని కూడా ఇది కావాలి అని ఎప్పుడు. ఆమె నోరు తెరిచి అడగదు కానీ నాన్న అమ్మ బయటకి షాపింగ్ కి వెళ్తే మాత్రం బట్టలు బ్యాగులన్నీ ఆమెకే వస్తాయి. అప్పుడే అర్థమైంది ఏమీ అడగక పోతేనే అన్ని వస్తాయి అని అంటూ సరదాగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్. మొత్తానికైతే మొదటిసారి తన అక్క, చెల్లి గురించి ప్రస్తావించి తమ మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు రామ్ చరణ్.