Kireon Pollard: క్రికెట్ ఫార్మాట్ ఏదైనా బ్యాటర్లు సిక్సర్లు బాధితే ఆ ఆనందమే వేరు. క్రికెట్ అభిమానులకు ఈ సిక్సర్లు ఎంతో కిక్ ని ఇస్తాయి. అంతర్జాతీయ క్రికెట్ లో వివిధ దేశాల తరపున ఎందరో క్రికెటర్లు బరిలో నిలిచినా.. భారీ సిక్సర్ షాట్లను అలవోకగా బాధగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు అతికొద్ద మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కరేబియన్ విధ్వంసకర ఓపెనర్, సునామి హిట్టర్ క్రిస్ గేల్ గురించి మాత్రమే ముందుగా చెప్పుకోవాలి.
Also Read: BCCI Rules-Team India: టీమిండియా ప్లేయర్లకు 10 కొత్త రూల్స్ పెట్టిన BCCI..షూట్స్,VIP కోటా రద్దు !
ఎందుకంటే క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డ్ క్రిస్ గేల్ పేరు పైనే ఉంది. ఇతడు బంతిని బలంగా బాధడంలోనూ, బౌండ్రి లైన్ ని మంచినీళ్ల ప్రాయంగా దాటించడంలోనూ గేల్ తర్వాతే ఎవరైనా. అంతర్జాతీయ క్రికెట్ లో క్రిస్ గేల్ 1,056 సిక్సులతో గరిష్టంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే తాజాగా తన మెరుపు ఇన్నింగ్స్ తో భారీ సిక్సులు బాది వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కీరణ్ పోలార్డ్ {Kireon Pollard} రెండవ స్థానాన్ని భర్తీ చేశాడు.
టి-20 అంతర్జాతీయ క్రికెట్ లో 900 సిక్సర్లు కొట్టి చరిత్రలో రెండవ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు పోలార్డ్. డెసర్ట్ వైపర్స్ తో జరిగిన ఐఎల్టి టి-20 క్లాష్ లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కోసం రాపిడ్ – ఫైర్ ప్రదర్శనలో పోలార్డ్ {Kireon Pollard} ఈ అసాధారణ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన పోలార్డ్ తన పవర్ హిట్టింగ్ పరక్రమాన్ని బయట పెట్టాడు.
మూడు భారీ సిక్సులతో మొత్తంగా 36 పరుగులు చేశాడు. ఈ మూడు సిక్స్ లతో 900 టి-20 సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి, ఎమిరేట్స్ 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఈ అత్యధిక సిక్సర్లు బాదిన లిస్ట్ లో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు 901 సిక్స్ లతో {Kireon Pollard} పోలార్డ్ రెండవ స్థానంలో, వెస్టిండీస్ కి చెందిన మరో ఆటగాడు ఆండ్రీ రస్సెల్ 727 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read: Chandrababu – Nitish Kumar Reddy: సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్…రూ. 25 లక్షల చెక్ అందజేత
అలాగే నికోలస్ పురాన్ 593 సిక్సర్లతో నాలుగో స్థానం, కోలిన్ మున్రో 550 సిక్సర్లతో ఐదవ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కి వీడ్కోలు పలికిన {Kireon Pollard} పోలార్డ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుకి సహాయ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
Kireon Pollard on 2nd Place After Chris Gayle WithMost Sixes in T20s…..🥶🥶#zelena #ChampionsTrophy2025 #BetwaySA20 #SaifAliKhan #TheTraitorsUK #bplt20 #DPWorldILT20 pic.twitter.com/RTQX3TKcgz
— جويرية ✨ (@jnking282) January 16, 2025