OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇందులో హాలీవుడ్ సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలకు అభిమానులు ఎక్కువగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే హాలీవుడ్ మూవీలో హీరో కి మోయలేనంత బంగారం దొరుకుతుంది. అది కూడా ఒక ఎడారి ప్రాంతంలో. దానిని దక్కించుకునే ప్రయత్నంలో హీరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గోల్డ్’ (Gold). 2022 లో వచ్చిన ఈ ఆస్ట్రేలియన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి ఆంథోనీ హేస్ దర్శకత్వం వహించారు. ఇందులో జాక్ ఎఫ్రాన్, సూసీ పోర్టర్, ఆంథోనీ హేస్ నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జాక్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఓ మారుమూల ప్రాంతానికి వెళ్తుంటాడు. ట్రైన్ దిగినప్పుడు అతడు బుక్ చేసుకున్న కారు ఒకటి స్టేషన్ దగ్గరికి వస్తుంది. ఆ కారు గుండా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది జాక్. డ్రైవర్ తో కలిసి తాను చేరాల్సిన ప్రాంతానికి, కారు ప్రయాణం మొదలు పెడతాడు జాక్. ఒకచోట అనుకూకుండా కారు సడన్గా ఆగిపోతుంది. దాన్ని వీళ్ళు రిపేరు చేస్తున్నప్పుడు, అక్కడ వీళ్లకు కొన్ని రాళ్లు కనపడతాయి. వాటిని చెక్ చేసినప్పుడు అక్కడ బంగారంతో కూడిన పెద్ద రాయి కనపడుతుంది. అది చాలా బరువు ఉండటంతో ఎంత ప్రయత్నించినా దానిని బయటకు తీయలేక పోతారు. దానిని బయటకు తీయాడానికి కారుకి తాడు కట్టి లాగుతారు. అయినా ఆ బంగారు రాయి రాకపోవడంతో, ఒక మిషన్ తెస్తానని డ్రైవర్ సిటీ వైపు వెళ్తాడు. అతడు రావడానికి టైం పట్టడంతో జాక్ బంగారం దగ్గరే ఉంటాడు. అతని దగ్గర కొంత ఆహారం మాత్రమే ఉంటుంది. నీళ్లు కూడా సరిపడా ఉండవు. అయితే బంగారం మీద ఆశతో అక్కడే ఉండిపోతాడు జాక్. అక్కడ ఇసుక తుఫాన్లు అడవి కుక్కలతో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు జాక్. ఇతని దగ్గర తినటానికి కూడా ఏమీ ఉండవు. డ్రైవర్ రావడానికి ఆలస్యం అవుతుందని చెప్తూ ఉంటాడు. నిజానికి డ్రైవర్ వచ్చినా కూడా అతని దగ్గరికి రాకుండా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్నిచూసి అలాగే ఉండిపోతాడు. చివరికి జాక్ బంగారాన్ని బయటకి తీస్తాడా? డ్రైవర్ అతనికి సహాయం చేస్తాడా ? మరి ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గోల్డ్’ (Gold) అనే ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.