HariHara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో అనౌన్స్ చేసిన సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఏ సినిమా రిలీజ్ డేట్ అని కూడా అనౌన్స్ చేసింది. అయితే కొన్ని కారణాలవల్ల సినిమా మరోసారి వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని ముందుగా మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కాస్త పెండింగ్ ఉండడంతో ఈ సినిమాని మేకి షిఫ్ట్ చేసినట్లు తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్తో అధికారికంగా ప్రకటించేశారు..
ప్రతి పండకు సినిమా నుంచి ఏదో ఒక పోస్టర్లు లేదా ఏదో ఒక అప్డేట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటుగా ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. అయితే మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది మొన్నటి వరకు మార్చి 28న రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు అధి కాస్త మేకి షిఫ్ట్ అయింది. మరి ఈ డేట్ అన్నా కన్ఫామ్ అవుతుందో లేదో చూడాలి.
Also Read :రామ్ చరణ్ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్..?
ఈ చిత్రం మొదట మార్చి 29 న థియేటర్లలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా కొనసాగుతున్నందున విడుదలను వెనక్కి వెళ్లిందని టాక్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం. ఏం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. బ్రిటీషర్స్, మొగలాయి చక్రవర్తుల కాలానికి సంబంధించిన చారిత్రక కథతో ఎ.ఎం. రత్నం సమర్పణలో ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తొలి భాగం దాదాపు పూర్తయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ పై ఓ కీలక ఘట్టాన్ని రాజస్థాన్ లో చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో అనివార్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరి ఆ డేట్ నైనా కన్ఫామ్ చేస్తారు మళ్లీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేదంటూ పోస్ట్ పోన్ చేస్తారేమో చూడాలి.. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను అనౌన్స్ చేశారు.. త్వరలోనే ఆ సినిమాల డేట్స్ ను అనౌన్స్ చెయ్యనున్నారు..
https://x.com/MegaSuryaProd/status/1900351371481948276