Brahmamudi serial today Episode: కావ్య ఏడుస్తూ కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి కృష్ణా అందరూ ఆయన లేడంటున్నారు. చనిపోయారు అంటున్నారు. కానీ నా మనసు ఎందుకో ఆయన బతికే ఉన్నాడని చెప్తుంది. కృష్ణా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ నిజం నీకు తెలుసు.. నాకు తెలుసు.. కానీ వీళ్లను ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు. వాళ్ల బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియడం లేదు. అయన ఎక్కడున్నా సరే తిరిగి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలి. ఈ అన్వేషణలో నాకు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వే తోడుగా ఉండాలి. మా ఆయన ఎక్కడున్నది తెలుసుకునే మార్గం నువ్వే చూపించు అంటూ వేడుకుంటుంది.
మరోవైపు భోజనం చేస్తున్న రాజ్ కు పొలమారడంతో యామిని నీళ్లు ఇస్తూ మెల్లగా తినమని చెప్తుంది. యామిని వాళ్ల నాన్న బాబు ఎవరో బాగా తలుచుకుంటున్నట్టు ఉంది అంటాడు. దీంతో వైదేహి ఇంకెవరు ఆయన భార్య అయ్యి ఉంటుంది అంటుంది. దీంతో రాజ్ షాకింగ్‌గా చూస్తూ.. భార్యా.. నాకు పెళ్లి అయిందా..? అని అడుగుతాడు. దీంతో వైదేహి అదే బాబు యామిని నీకు కాబోయే భార్య కదా..? పక్కనే ఉన్నా నీ ధ్యాసలోనే ఉంటుంది కదా అందుకే అలా అన్నాను అని చెప్పగానే యామిని కూడా ఎస్ బావా.. నీకు ఈ ప్రపంచంలో మా అమ్మా నాన్నలు తప్పా ఇంకెవరూ లేరు బావ.. ఇంకెవరైనా ఉన్నారేమోనని ఆలోచించకు.. తిను బావ అంటుంది. రాజ్ మాత్రం ఆలోచిస్తుంటాడు.
అప్పు, స్వప్న ఇద్దరూ మెట్ల మీద కూర్చుని కావ్య గురించి బాధపడుతుంటారు. ఇంట్లో అందరూ బావ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బాధపడుతుంటే అక్క మాత్రం అసలు ఏమీ జరగలేదు అన్నట్టు నార్మల్‌గా ఉంటుంది. టైం కు ఫుడ్డు ప్రిపేర్ చేసి అందరిని భోం చేయమని చెప్తుంది. ఎవరైనా బావ చావు గురించి మాట్లాడుతుంటే కోప్పడుతుంది. అసలు అక్క ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందో లేదో.. అక్కను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అక్క అసలు ధైర్యంగా ఉందా..? ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుందా..? లేక మెంటల్‌గా ఏమైనా డిస్టర్బ్ అయిందా అని అప్పు బాధపడుతుంది. స్వప్న కూడా కావ్యను అలా చూసి అపర్ణ ఆంటీ ఇంకా బాధపడుతున్నారు.
నిజంగానే కావ్య పిచ్చిదై పోతుందేమో అనిపిస్తుంది అప్పు అని ఏడుస్తుంది. ఎందుకై పోతుంది. అక్కా అలా ఎలా అనుకుంటావు అంటూ తిడుతుంది. మరి అలా ప్రవర్తిస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి అని స్వప్న అడుగుతుంది. దీంతో అప్పు తన నమ్మకమే నిజం అవుతుందేమో బావ ఇంటికి తిరిగి వస్తాడేమో అలా కూడా అనుకోవచ్చు కదా అంటుంది. దీంతో స్వప్న కోసంగా ఎలా అనుకుంటామే.. స్వయంగా నువ్వే రాజ్ బట్టలు, వస్తువులు తీసుకొచ్చావు కదా..? ఇంకెలా వస్తాడు అని అడుగుతుంది. అదే నా అనుమానం అక్కా బట్టలు, వస్తువులు దొరికాయి కానీ మనం బాడీ చూడలేదు. కదా చిన్న డొంక దొరికినా సరే లాగితే మొత్తం బయటకు వస్తుంది.
రాజ్ ఆలోచిస్తుంటే వెనక నుంచి యామిని వచ్చి కాలేజీలో నీ వెనక తిరిగినప్పుడు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశమే ఇచ్చే వాడివి కాదు. ఇప్పుడు చూడు నువ్వే వచ్చి నా దగ్గర ఉన్నావు. దేవుడు చూశావా ఎలా చేశాడో.. ఇక రాజ్ నిన్ను నా వైపు తిప్పుకోవడమే మిగిలింది అనుకుంటూ వెళ్లి వెనక నుంచి రాజ్‌ను హగ్ చేసుకోగానే రాజ్ విదిలించుకుంటాడు. తిరిగి యామినిని చూసి మీరా..? అదే నువ్వా యామిని నేనే వేరే ఎవరో అనుకుని భయపడిపోయాను అంటాడు. మన ఇంట్లో నేను తప్పా ఇంకెవరు ఉంటారు బావ. అయినా దీనికెందుకు ఇంత కంగారు పడతావు.
నీ చుట్టు ఉన్న వాటిని చూస్తుంటే నీకు ఇంకా నమ్మకం రావడం లేదా..? లేదంటే నా మాటలు మీద నీకు నమ్మకం కలగడం లేదా బావ అని అడుగుతుంది. దీంతో రాజ్ అలా ఏం లేదు యామిని నీ కళ్లల్లో నా మీద ఉన్న ఇష్టం కనిపిస్తుంది. అంకుల్ , ఆంటీ చూపిస్తున్న కేరింగ్ అర్థం అవుతుంది. ఇంట్లో ఉన్న ఫోటోలు జరిగిన వాటికి సాక్ష్యాలుగా ఉన్నాయి అంటాడు. దీంతో యామిని మరి నాకు దూరంగా ఎందుకు వెళ్తున్నావు. నాతో ఎందుకు క్లోజ్‌గా ఉండలేకపోతున్నావు బావ అని అడుగుతుంది. రాజ్ అదే అర్థం కావడం లేదు. నాకెందుకో నీకు దూరంగా ఉండాలనిపిస్తుంది. అని చెప్పగానే యామిని బాధపడుతూ సారీ బావ అంటూ వెళ్లిపోతుంది.
రాహుల్‌ను ఆఫీసుకు పంపేందుకు రుద్రాణి రెడీ చేస్తుంది. రాహుల్ మనకు ఇది అవసరమా మమ్మీ అని అడగ్గానే టైం వచ్చినప్పుడే మనం కంపెనీ సీఈవో కుర్చీ లాగేసుకోవాలి అని చెప్తుంది. ఇంతకు ముందు రాజ్‌తో పాటు కావ్య కంపెనీ బాధ్యతలు చూసుకునే వారు. ఇప్పుడు రాజ్ లేడు.. రాజ్ కోసం ఆలోచిస్తున్న కావ్య ఆఫీసుకు వెళ్లద్దు. ఈ దుగ్గిరాల బ్యాచ్ మొత్తం ఆ షాక్‌లోంచి బయటకు వచ్చే లోపు వాళ్లకు నువ్వు తప్పా ఎవ్వరూ దిక్కు లేదు అన్నట్టుగా మారిపోవాలి అని చెప్తుంది.
యామిని, వైదేహి వాళ్ల ఆయన ముగ్గురు కలిసి టీ తాగుతూ ఉంటారు. ఇంతలో వైదేహి ఏమంటున్నాడు మీ రాజ్ అని అడుగుతుంది. నేను గుర్తు రావడం లేదని బాధపడుతున్నాడని చెప్తుంది. దీంతో నువ్వెవరో తనకు గుర్తు వస్తే.. తర్వాత నువ్వే జీవితాంతం బాధపడాలి. మంచో చెడో త్వరగా అతనితో తాళి కట్టించుకుంటే.. తర్వాత నీ దగ్గర ప్రూప్స్ ఉంటాయి అని చెప్తుంది. ఇంతలో రాజ్ కిటికి దగ్గరకు వచ్చి చూడటంతో మళ్లీ రాజ్ మీద జాలి పడ్డట్టు నాటకం ఆడతారు. ఇలాగే ఉంటే బావతో నా పెళ్లి జరగదు అంటూ యామిని బాధపడ్డట్టు నాటకం ఆడుతుంది. రాజ్‌అంతా గమనిస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?