OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కువగా వెబ్ సిరీస్ లకు అలవాటు పడిపోయారు మన జనాలు. వీటిలో రొమాంటిక్ వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ కూడా ఉంది. వీటికోసం ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ శాడిస్ట్ మొగుడు, ప్రేమించే ప్రియుడు అన్నట్టుగా ఉంటుంది. చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో
ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ పేరు ‘హజరతేన్’ (Hajaratein). ఈ సిరీస్ కి హజరత్ ప్రభు, నీలిమ, అంశుమన్ కిషోర్ సింగ్ దర్శకత్వం వహించారు. పైకి మంచిగా నటిస్తూ లోపల నరకం చూపించే భర్త, ప్రేమ కోసం తపించే భార్య చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. వీళ్లిద్దరి మధ్యలోకి మరో వ్యక్తి రావడంతో స్టోరీ మలుపు తీసుకుంటుంది. 2022 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సాకేత్ సమాజంలో మంచి పేరు తెచ్చుకుని ఉంటాడు. ఇతనికి రచయితగా కూడా సమాజంలో గౌరవం ఉంటుంది. అయితే ఇదంతా పైకి మాత్రమే. రాత్రి అయితే భార్య పూర్వీ తో మాత్రం చాలా శాడిస్ట్ గా ఉంటాడు. కేవలం పడక సుఖం కోసమే వాడుకుంటాడు. తనకి ఇస్టం వుందో లేదో కూడా తెలుసుకోకుండా మృగం లా రెచ్చి పోతుంటాడు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు హింసిస్తూ ఉంటాడు. వీడి హింస భరించలేక, అతనితో విడిపోవాలని అనుకున్నా పూర్వీమాత్రం ఆ పని చేసే ధైర్యం చేయలేక పోతుంది. సమాజం ఏమనుకుంటుందో అని భయపడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె కూడా ఏదైనా స్టోరీలు రాయాలనుకుంటుంది. ఒంటరి తనం పోగొట్టుకోవడానికి అదే మార్గం అనుకుంటుంది. ఇందుకోసం భర్త ఏర్పాటుచేసిన ఫంక్షన్ లో పరిచయమైన అతుల్ అనే వ్యక్తి సాయం తీసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు దగ్గరవుతారు.
ఇక రచనల పేరుతో వీళ్ళు రాత్రంతా భజన చేస్తూ ఉంటారు. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆమెతో పడక గదిలో రెచ్చిపోతుంటాడు. అలా పూర్వి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తరువాత పూర్వీ భర్తకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. అతని మరో కోణాన్ని నవల రూపంలో రాయాలని అనుకుంటుంది. రాయడం కూడా మొదలు పెడుతుంది. చివరికి పూర్వీ, అతుల్ వ్యవహారం భర్తకి తెలుస్తుందా? వీళ్ళిద్దరి లవ్ మేటర్ ఎంతవరకు వెళుతుంది? భర్త శాడిజం పై స్టోరీ రాస్తుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హజరతేన్’ (Hajaratein) అనే ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.