BigTV English

Chocolate Face Mask: చాక్లెట్ ఫేస్ మాస్క్‌తో.. గ్లోయింగ్ స్కిన్

Chocolate Face Mask: చాక్లెట్ ఫేస్ మాస్క్‌తో.. గ్లోయింగ్ స్కిన్

Chocolate Face Mask: చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాక్లెట్ మీ చర్మానికి మ్యాజిక్ లాగా పనిచేస్తుందని మీకు తెలుసా. చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్.. మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, పోషించడానికి సహాయపడుతుంది. దీని వల్ల మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా, మచ్చలు లేకుండా కనిపిస్తుంది.


ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడేబదులు ఇంట్లోనే చాక్లెట్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని మీ ముఖానికి ఎందుకు అప్లై చేయకూడదు ? మీ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించే 5 చాక్లెట్ ఫేస్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.చాక్లెట్, హనీ ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు
కోకో పౌడర్-2 టేబుల్ స్పూన్లు
తేనె- 1 టేబుల్ స్పూన్
పెరుగు-1 టేబుల్ స్పూన్


చాక్లెట్ పౌడర్, తేనె, పెరుగు కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి. దీన్ని మీ ముఖం , మెడపై సమానంగా అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇందులో ఉండే తేనె చర్మానికి సహజ తేమను అందిస్తుంది.

2. చాక్లెట్, కాఫీ ఫేస్ ప్యాక్ :
కావాల్సిన పదార్థాలు
కోకో పౌడర్- 2 టేబుల్ స్పూన్లు
మెత్తగా రుబ్బిన కాఫీ- 1 టేబుల్ స్పూన్
పాలు లేదా పెరుగు- 1 టేబుల్ స్పూన్

పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని మీ ముఖంపై వృత్తాకారంగా, సున్నితంగా మసాజ్ చేయండి. దీనిని 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడం ద్వారా డల్ స్కిన్ ని కాంతివంతంగా మారుస్తుంది. కాఫీ రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

3. చాక్లెట్, బనానా ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
డార్క్ చాక్లెట్- 2 టేబుల్ స్పూన్లు
అరటిపండు గుజ్జు- సగం

కరిగించిన డార్క్ చాక్లెట్‌ను గుజ్జు చేసిన అరటిపండ్లతో కలపండి. దీన్ని మీ ముఖం , మెడపై అప్లై చేయండి. దీన్ని చర్మంపై 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని అందంగా మారుస్తుంది.

4. చాక్లెట్, అలోవెరా ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
చాక్లెట్ పౌడర్- 1 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్- 1 టీ స్పూన్

ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై చికాకు, ఎరుపును తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది సున్నితమైన లేదా మొటిమలకు గురయ్యే చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు చర్మానికి హైడ్రేషన్, పోషణను అందిస్తుంది. అంతే కాకుండా చాక్లెట్ స్కిన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ, మెరుపును పెంచుతుంది.

Also Read: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది !

5. చాక్లెట్, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
చాక్లెట్ పౌడర్- 1 టేబుల్ స్పూన్
ముల్తానీ మిట్టి – 1 టేబుల్ స్పూన్

చాక్లెట్ పౌడర్, ముల్తానీ మిట్టిని తగినంత రోజ్ వాటర్ తో కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న అదనపు నూనెను నియంత్రించడం ద్వారా రంధ్రాలను తెరుచునేలా చేస్తుంది. అంతే కాకుండా మీ చర్మానికి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×