BigTV English

IT: Welcome to Derry Trailer – హర్రర్ థ్రిల్లర్.. IT ప్రీక్వెల్ వచ్చేస్తోంది.. ఈ సారి వెబ్ సీరిస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?

IT: Welcome to Derry Trailer – హర్రర్ థ్రిల్లర్.. IT ప్రీక్వెల్ వచ్చేస్తోంది.. ఈ సారి వెబ్ సీరిస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?

IT: Welcome to Derry Trailer: HBO టెలివిజన్ IT సిరీస్లో మూడవ భాగం వచ్చేసింది. హర్రర్ మూవీలను ఇష్టపడే ఫ్యాన్స్ కు భయానక వాతావరణంలోకి తీసుకెళ్ళింది IT సిరీస్. స్టీఫెన్ కింగ్ రాసిన ఐటీ నవల ఆధారంగా 2017, 2019లో విడుదలైన IT చాప్టర్ -1, IT చాప్టర్ -2 సిరీస్ లకు ప్రీక్వెల్ గా HBO టెలివిజన్ ఓ సిరీస్ ను అభివృద్ధి చేస్తోంది. దీని పేరు IT welcome to Derry. ఈ సిరీస్ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.. మిగతా వివరాలు ఇలా…


హర్రర్ థ్రిల్లర్.. IT ప్రీక్వెల్ వచ్చేస్తోంది..

ఈ వెబ్ సిరీస్ ప్రోమో ఆద్యంతం భయానకంగా ఉంటుంది. 1960లో 27 సంవత్సరాల ముందు జరిగిన కథగా డెర్రీ మైన్ అనే పట్టణాలలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. పెన్ని వైస్ మూలాలు, దాని ఎక్స్ట్రాక్టెడ్ మెన్షన్ స్వభావం డెర్రీ లోని భీకరమైన, భయానక ప్రభావాలను ఈ సిరీస్ లో మనం చూడొచ్చు. బిల్ స్కార్స్ గార్డ్ మళ్లీ పెన్ని వైస్ ది క్లౌన్ పాత్రలో కనిపిస్తారు. ఈ సిరీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఇతను పనిచేయడం విశేషం. ఇక ఈ సిరీస్ ప్రధాన తారాగణం.. టేలర్ పైజ్, జోవన్ అడెపో, క్రిస్ చాల్క్, జేమ్స్ రీమర్, స్టీఫెన్ రైజర్, రూడీ మాన్కూసో నటిస్తున్నారు .


ప్రోమో లో ..డేరి భయానకం ..

ఈ IT సీక్వెల్ దర్శకుడు అండి ముచ్చిట్టి, బార్బర్ ముస్చిట్టి, జాసన్ ఫుచ్స్ సిరీస్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్ మొదటి నాలుగు ఎపిసోడ్ లకు అండి ముచ్చిట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్ లు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రముఖ టెలివిజన్ హెచ్ బి ఓ లో విడుదల కానున్నాయి. ఐటీ సంఘటనకు 27 సంవత్సరాల ముందు సెట్ చేయబడిన ఈ సిరీస్ పిల్లలను వెంటాడే పాత్ర పెన్ని వైన్స్ ది క్లౌన్ కథను గా రానుంది. ప్రోమో స్టార్టింగ్ లో ఒక పిల్లవాడు రాత్రిపూట లిఫ్ట్ అడుగుతాడు. అటుగా వెళుతున్న ఓ జంట కారులో అతనికి లిఫ్ట్ ఇస్తుంది‌. నిన్ను సురక్షితంగా మీ ఇంటి దగ్గర చేరుస్తామని కారులో ఉన్న ఓ పెద్ద మనిషి అంటాడు. ఎక్కడైనా డెర్రీ ఉంటుంది అని ఆ పిల్లవాడు అంటాడు. కట్ చేస్తే.. కొంతమంది స్కూల్ పిల్లలు, వారిని భయపెట్టే ఓ వ్యక్తి, పెద్దలకి చెప్పకుండా అతని నుంచి ఎలా రక్షణ పొందారు. చివరికి వారు ఏం చేశారు. ఆ పిల్లని భయపెడుతున్న పెన్నీ వైన్స్,డేరి  గురించి పెద్దలకి తెలుస్తుందా అనేది తెలియాలంటే సిరీస్ చూడాలి.

ఈ సారి వెబ్ సీరిస్‌గా.. ఏ ఓటీటీలో..

స్టీఫెన్ కింగ్ ఈ సిరీస్ గురించి స్పందిస్తూ డెర్రీ యొక్క భయానకం ఈ సిరీస్ లో మీరు చూడొచ్చు అంటూ ముచ్చిటి టీం ఈ సిరీస్ ని ఎంతో అభివృద్ధి చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ చూద్దామా అని ఎదురుచూసే ఫ్యాన్స్ కు స్టీఫెన్ కింగ్ అభిమానులకు ఈ సిరీస్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఆధ్యాంతం భయానకంగా, ఎంతో ఉత్కంఠ భరితంగా సాగనుంది. ట్రైలర్ చూసిన అభిమానులు ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. హర్రర్ సీక్వెల్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ సూపర్ ఛాయిస్ కానుంది.ఈ సిరీస్ HBO Max లో సమ్మర్ లో  అందుబాటులోకి రానుంది.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×