Telugu Heroes : ఒక హీరో రిష్కీ షాట్స్ చేస్తున్నప్పుడు డూప్‌ను వాడటం సహజం. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీనే. స్టార్ హీరో రిస్కీ షాట్లో పాల్గొన్నప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే మిగిలిన చిత్రీకరణకు ఇబ్బందులు వస్తాయి. షూటింగ్ లేకపోతే.. ఎంతో మందికి పూట గడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే హీరోలతో తొందరగా రిస్కీ షాట్లు వంటివి చేయించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపరు.
అలాగే హీరోలు డబుల్ యాక్షన్ చేసే టైంలో కూడా డూప్‌ల అవసరం ఉంటుంది. ‘హలో బ్రదర్’ వంటి సినిమాల్లో నాగార్జునకు శ్రీకాంత్ డూప్ గా చేశారు. ‘గబ్బర్ సింగ్’ లో ఒక సీన్లో పవన్ అందుబాటులో లేకపోతే హరీష్ శంకర్ .. డూప్ గా చేయడం జరిగింది. సో స్టార్ హీరోలకి డూప్ అవసరం ఉంటుంది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు డూప్‌లను ఎంతవరకు వాడాలో అంత వరకు వాడుకునే వారు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే డూప్ లేకుండా అన్ని సీన్లలో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఎన్నోసార్లు బాలయ్య చేతులు కాళ్ళు ఇరగ్గొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వెంకటేష్ సైతం ‘తులసి’ వంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు గాయపడ్డారు. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కోసం చేసిన రిస్కీ షాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక చిరంజీవి ‘సైరా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో చాలా వరకు డూప్ ను అవాయిడ్ చేశారు. కానీ ఇప్పటి జెనరేషన్ హీరోలు మాత్రం పూర్తిగా డూప్‌ల పైనే అదరపడిపోతున్నారు.
ప్రభాస్ కి “కిరణ్ రాజ్” అనే డూప్ ఉన్నాడు. ‘బాహుబలి’ లో చాలా యాక్షన్ సీన్స్ లో నటించింది అతనే. ‘కల్కి 2898 ad’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో ఎక్కువగా డూప్ షాట్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా “ఈశ్వర్” అనే వ్యక్తి చేస్తున్నాడు. ‘దేవర’ లో అయితే0” రేవంత్” అనే వ్యక్తి దేవర పాత్రకి డూప్‌గా చేయడం జరిగింది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’ లో డూప్ ను వాడటం జరిగింది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు సెట్స్ కి రాకపోతే డూప్ తో తీసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 5 రోజులు పెండింగ్ ఉంటే 2 రోజులు మాత్రమే పవన్ షూటింగ్లో పాల్గొన్నారు. మిగిలిన పార్ట్ డూప్ తో చేశారు. ఇప్పుడు ‘ఓజి’ ముంబై షెడ్యూల్ కోసం కూడా పవన్ బాడీ డబుల్ ను వాడుతున్నట్టు తెలుస్తుంది.
ఇలా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ డూప్‌లపైనే ఆధారపడుతున్నారు. దీంతో వీళ్ళ పారితోషికాలు కూడా లక్షలు పలుకుతున్నాయట. అయితే రిస్కీ షాట్ల కోసం కాకుండా ప్రతి ఫైట్ సీన్ కు డూప్ ను వాడటం అనేది ఎంత వరకు కరెక్ట్. అభిమానులు హీరోల కోసం టికెట్లు కొంటున్నట్టా? లేక డూప్‌ల కోసం టికెట్లు కొంటున్నట్టా? ఇది నైతికంగా ఎంత వరకు కరెక్ట్ అనేది స్టార్ హీరోలే ఆలోచించుకోవాలి.